Begin typing your search above and press return to search.

బాలాపూర్ లడ్డూ.. మరో రికార్డ్ బద్దలు.. అసలు దీని చరిత్ర ఏంటి?

By:  Tupaki Desk   |   9 Sep 2022 7:13 AM GMT
బాలాపూర్ లడ్డూ.. మరో రికార్డ్ బద్దలు.. అసలు దీని చరిత్ర ఏంటి?
X
బాలాపూర్ గణేష్ లడ్డూ మరోసారి రికార్డులు బద్దలు కొట్టింది. తాజాగా నిర్వహించిన వేలంలో ఏకంగా రూ.24.60 లక్షలకు అమ్ముడుపోయింది. వంగేటి లక్ష్మారెడ్డి అనే వ్యక్తి ఇంత అత్యధిక ధర పెట్టి వేలంలో కొన్నారు. గత ఏడాది కంటే ఈ ధర ఏకంగా 5.70 లక్షలు కావడం గమనార్హం.

తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ప్రసిద్ధి చెందిన బాలాపూర్ లడ్డూకు చరిత్ర ఉంది. బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి 1980లో ఏర్పాటు చేసి గణేష్ ఉత్సవాలు నిర్వహించారు. 1994లో తొలిసారి బాలాపూర్ లడ్డూ వేలం పాట మొదలుపెట్టారు. నాడు ఈ లడ్డూ తీసుకున్న వారికి రియల్ ఎస్టేట్ సహా వ్యాపారాల్లో బాగా కలిసి వచ్చి కోటీశ్వరులు అయ్యారు. దీంతో ఆసెంటిమెంట్ తెలుగు రాష్ట్రాల్లో బాగా బలపడింది. అందుకే బాలాపూర్ లడ్డూకు అంతటి డిమాండ్ వచ్చిపడింది.

1994లో 450 రూపాయలతో మొదలైన లడ్డూ వేలం పాట తాజాగా 24 లక్షలకు చేరింది. ఇప్పటివరకూ ఇదే అత్యధికం. గగత ఏడాది 18.90 లక్షల మేర పలికింది. ఈ ఏడాది మరో 5 లక్షలకు పైగా ధర పలకడం విశేషం.

కరోనా కారణంగా 2020 సంవత్సరంలో మాత్రం లడ్డూ వేలాన్ని రద్దు చేశారు. ఇక ప్రతీ సంవత్సరం ఇది జరిగింది. బాలాపూర్ లడ్డూతో అన్ని విధాల అదృష్టం కలిసి వస్తుందని నమ్ముతారు. పోయిన సారి ఏపీ ఎమ్మెల్సీ ఒకరు వేలం పాట పాడి మరీ దీన్ని దక్కించుకోవడం విశేషం.

ఇక లడ్డూ వేలం పాట ద్వారా వచ్చిన డబ్బును బాలాపూర్ ఉత్సవ సమితి ఆ ప్రాంత అభివృద్ధికి, సేవా కార్యాక్రమాలకు ఖర్చు పెడుతుంది.

నవరాత్రి రోజుల్లో ఇక్కడ రోజూ అన్నదానం నిర్వహిస్తారు. కనీసం 5 వేల మందికి తక్కువ కాకుండా భోజనాలు పెడతారు. ఇదంతా ఒక ఎత్తు అయితే బాలాపూర్ గణపతి లడ్డు వేలం ఇంకొక ఎత్తు. తెలుగు రాష్ట్రాల్లో బాలాపూర్ లడ్డు వేలం ఏటా రికార్డ్ స్థాయిలో ధర పలుకుతుంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.