Begin typing your search above and press return to search.

లోక్ సభలో వైసీపీ పక్షనేతగా బాలశౌరి...

By:  Tupaki Desk   |   28 May 2019 2:27 PM GMT
లోక్ సభలో వైసీపీ పక్షనేతగా బాలశౌరి...
X
150 అసెంబ్లీ సీట్లు గెలుచుకొని తిరుగులేని ఆధిక్యం సాధించిన వైసీపీ ఇటు లోక్ సభ ఎన్నికల్లో రికార్డు విజయాన్ని అందుకొంది.. 22 మంది ఎంపీలతో వీచిన ఫ్యాన్ గాలికి టీడీపీ కేవలం మూడు ఎంపీలకే పరిమితమైంది... మరీ ఈ 22 మంది ఎంపీలను సభలో లీడ్ చేసేదేవరు... ప్రత్యేక హోదా సాధన తోపాటు రాష్ట్రానికి విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన నిధులు రాబట్టడంతో పాటు.. ఎన్డీఏ తిరుగులేని ఆధిక్యత సాధించింది కాబట్టి సభలో సమర్థవంతంగా, లౌక్యంగా వ్యవహరించే కోణంలో వైఎస్ జగన్ మచిలీపట్నం నుంచి గెలుపొందిన ఎంపీ బాలశౌరీని లోక్ సభ పక్షనేతగా ఎంపిక చేసినట్లు తెలిసింది..

ఫలితాల తర్వాత అమరావతిలో వైసీపీ శాసనసభపక్ష సమావేశం జరిగింది. శాసనసభ పక్ష నేతగా జగన్ను ఎన్నుకున్నారు.. ఆ సమావేశం తరువాత పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగాల్సి ఉన్నా.. వాయిదా పడింది.. అయితే పార్లమెంటరీ పార్టీ నేతగా బాలశౌరి ని ఎంపిక చేయాలని జగన్ నిర్ణయించారట... రెండో సారి ఎంపీగా గెలిచిన మిథున్ రెడ్డి, ఒంగోలు నుంచి గెలుపొందిన సీనియర్ నేత మాగుంట శ్రీనివాసరెడ్డి, నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి పేర్లు పరిశీలనలోకి వచ్చినా.. అనుభవం.. ఢిల్లీ స్థాయిలో పరిచయాలు నేపథ్యంలో బాలశౌరీ వైపు వైఎస్ జగన్ మొగ్గు చూపారని తెలుస్తోంది... ఎలాగూ రాజ్యసభ పక్ష నేతగా విజయసాయి రెడ్డి ఉండనే ఉన్నారు..
టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కాపు సామాజికవర్గానికి చెందిన తోట నరసింహాం పార్లమెంటరీ పార్టీ నేతగా పనిచేశారు.. బాలశౌరి కూడా అదే సామాజికవర్గానికి చెందిన నేత .. అందులోనూ గతంలో వైఎస్ కు ఇప్పుడు జగన్ కు అత్యంత సన్నిహిత నేతగా గుర్తింపు పొందారు.. అందుకే సన్నిహితుడు క్యాటగిరీతో పాటు కాపు సామాజికవర్గానికి పార్లమెంటరీ పార్టీ పగ్గాలు అప్పగించామనే సంకేతాలు పోతాయని జగన్ ఈ నిర్ణయానికొచ్చారంటున్నారు...