Begin typing your search above and press return to search.
బాలఠాక్రే.. విషపు విత్తనం నాటారు.. మహా పాలిటిక్స్‌పై దుమ్మురేపుతున్న కామెంట్లు
By: Tupaki Desk | 22 Jun 2022 8:30 AM GMTమహారాష్ట్ర రాజకీయాల్లో ఇదో పెద్ద సంచలనం. నిన్న మొన్నటి వరకు బీజేపీతో తీవ్రంగా సతమతం అయి న.. శివసేన అధినేత, మహారాష్ట్రపులి.. బాల ఠాక్రే పెద్ద కుమారుడు.. రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు ఇప్పుడు సొంత మనిషి.. సొంత సోదరుడిగా భావించిన ఏకనాథ్ షిండే కంట్లో నలుసుగా మారారు.
ప్రస్తుతం 45 మంది ఎమ్మెల్యేలతో ఆయన సూరత్‌లో మకాం పెట్టడం.. ప్రభుత్వాన్ని గద్దె దింపుతానని బెదిరించడం.. దీనికి అనుగుణంగా.. ఉద్ధవ్ తన పపదవికి రాజీనామా చేస్తానని ప్రకటించడం.. సంచలనాలకే సంచలనంగా మారిపోయింది.
దీంతో అసలు ఈ ఏకనాథ్ షిండే ఎవరు? ఎక్కడి నుంచివచ్చారు.. అనే విషయాలపై నెటిజన్లు ఆసక్తిగా స్పందిస్తున్నారు. మహారాష్ట్ర పులి.. బాల ఠాక్రే జీవించిన సమయంలో శివసేన స్థాపించిన తర్వాత.. ఏకనాథ్ ఈ పార్టీకి చేరువయ్యారు. గతంలో షిండే.. ఒక రిక్షా కార్మికుడు. సినిమా పోస్టర్లను.. గోడలపై అంటించుకుని జీవించే వృత్తిలోనూ ఆయన కొనసాగారు. ఈ క్రమంలో శివసేన.. పోస్టర్లను గోడలకు అంటిస్తూ.. పార్టీలో కార్యకర్తగా మారారు.
ఒక సందర్భంలో.. బాలఠాక్రే కాళ్లు కడిగేందుకు ఇంటికి వచ్చిన షిండేకు.. ఠాక్రే.. తన పంచన ఆశ్రయం కల్పించారు. కౌన్సిలర్‌గా పోటీ చేసే అవకాశం ఇచ్చారు. ఇలా.. రాజకీయాల్లో ఎదిగిన షిండేను ఉద్ధవ్ సోదరుడిగా చూసుకున్నారు. తొలి సారి ఏర్పడిన శివసేన ప్రభుత్వం షిండేకు మంత్రి పదవి ఇచ్చారు.
బాల ఠాక్రే కూటమి సభ్యుడిగా.. ఉద్ధవ్‌కు రైట్ హ్యాండ్‌గా పేరు తెచ్చుకున్న షిండే.. పార్టీలో నెంబర్ 4గా ఉన్నారు. అలాంటి నాయకుడు ఇప్పుడు.. తిన్నింటి వాసాలు లెక్క పెడుతున్నారని.. నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.
"రాజకీయాల్లో ఇదో రకం. ఇది సంచలనం. ఠాక్రే నీడను చూసి భయపడే వాడు.. ఇప్పుడు ఠాక్రే కుటుంబా నికి వెన్ను పోటు పొడిచేందుకు సిద్ధమయ్యాడు. ఇలాంటి రాజకీయాలను ప్రజలు హర్షించరు" అని శివసేన కీలక నాయకుడు ఒకరు ట్వీట్ చేశారు. ఇదీ.. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితిని అని మేధావులు సైతం పెదవి విరుస్తున్నారు.