Begin typing your search above and press return to search.
నారావారిపల్లెలో బాలయ్య పరుగులు
By: Tupaki Desk | 16 Jan 2016 5:27 AM GMTసంక్రాంతి పండగ సందర్భంగా సకుటుంబ సమేతంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఫ్యామిలీ తమ సొంతూరు అయిన నారావారి పల్లెకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఆయన ఫ్యామిలీతో పాటు.. బాబు బావమరిది కమ్ వియ్యంకుడు బాలకృష్ణ ఫ్యామిలీ సైతం నారావారి పల్లెకు చేరుకుంది. ఉదయం నుంచి రాత్రి వరకూ వివిధ కార్యక్రమాల్లో బిజీ బిజీగా గడిపిన బాలయ్యబాబు.. తెల్లవారు జామున ట్రాక్ సూట్ ధరించి నారావారి పల్లె రోడ్ల మీద పరుగులు తీయటం అంతా ఆసక్తిగా చూశారు.
నిత్యం రన్నింగ్ చేసే బాలయ్య.. పండుగ వేళ సైతం.. అదే పద్ధతిని ఫాలో అవుతూ.. చీకట్లు కూడా తొలగకముందే నారావారి పల్లె రోడ్ల మీద జాగింగ్ చేసిన తీరు అందరి దృష్టిని ఆకర్షించింది. నిత్యం తాను జాగింగ్ చేస్తానని.. ఆరోగ్యానికి అది చాలా అవసరమంటూ బాలయ్య వ్యాఖ్యానించారు. ఏమైనా బాలయ్యబాబు పరుగులు నారావారి పల్లె లో హైలెట్ గా మారాయి. డిక్టేటర్ జాగింగ్.. ఆ గ్రామంలో పలువురికి స్ఫూర్తిగా నిలిచాయనటంలో సందేహం లేదు.