Begin typing your search above and press return to search.
ఆ ఎన్నికల ప్రచారంలోకి బాలయ్య ఎంట్రీ.. కథేంటి...?
By: Tupaki Desk | 22 Oct 2022 8:49 AM GMTసినీ నటుడు, టీడీపీ నాయకుడు, హిందూపురం ఎమ్మెల్యే.. పైగా.. టీడీపీ అధినేత చంద్రబాబుకు స్వయానా వియ్యంకుడు అయిన నందమూరి బాలకృష్ణ సడెన్ ఎంట్రీ ఇచ్చారు. రాజకీయంగా తాజాగా ఆయన కొన్ని వ్యాఖ్యలుచేశారు. అంతేకాదు.. ఎప్పుడూ..లేనిది ..ఒక ఎమ్మెల్సీ సీటు కోసం.. సెల్ఫీ వీడియో తీసుకుని.. మరీ.. ఆయన ప్రచారం చేశారు. రాయలసీమ జిల్లాలకు సంబంధించి గ్యాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఈ క్రమంలో టీడీపీ తరఫున భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి బరిలోకి దిగారు.
ఇప్పటికే జోరుగా ప్రచారం కూడా చేసుకుంటున్నారు. పార్టీ శ్రేణులకు చంద్రబాబు సైతం.. ఇప్పటికే వీడియో కాన్ఫరెన్సులు పెట్టి మరీ.. భూమిరెడ్డిని గెలిపించాలని అభ్యర్థించారు. అయితే.. ఇంత వరకు బాగానే ఉన్నా.. ఇప్పుడు అనూహ్యంగా బాలయ్య ఎంట్రీ ఇవ్వడం ఆశ్చర్యకరంగా ఉంది. ఎందుకంటే.. సాధారణ ఎన్నికల్లో కూడా.. బాలయ్య ఎప్పుడూ.. ఎవరికీ ప్రచారం చేయలేదు. పైగా. తన నియోజకవర్గానికే పరిమితం అయ్యారు. చివరకు ఒక్క నారా లోకేష్ అది కూడా.. ఆయన అల్లుడు కావడంతో మంగళగిరిలో గత ఎన్నికల్లో ప్రచారం చేశారు.
ఇక, ఆ తర్వాత.. టీడీపీ అనేక ఉద్యమాలు చేసినా.. వైసీపీపై నిప్పులు చెరిగినా.. ఎప్పుడూ మీడియా ముందుకు రాలేదు. ఒక్క నారా చంద్రబాబు సతీమణి.. భువనేశ్వరి విషయంపై వివాదం చెలరేగినప్పుడు మాత్రమే బాలయ్య తన కుటుంబంతోపాటు మీడియాముందుకు వచ్చారు.
ఇక, ఇటీవల అన్ స్టాపబుల్ షో ద్వారా.. 1995లో టీడీపీలో చోటు చేసుకున్న సంగతులు వివరించారు. అంతకుమించి.. ఎప్పుడూ.. బహిరంగ వేదికలపై ఆయన రాజకీయాలు ప్రస్తావించింది. లేదు. హిందూపురాన్ని జిల్లా కేంద్రం చేయాలని.. మాత్రం ఒకసారి రోడ్డెక్కారు.
అలాంటి బాలయ్య తాజాగా.. సొంత వీడియో తీసుకుని భూమిరెడ్డికి ప్రచారం చేశారు. దీంతో అసలు ఏంజరిగింది? ఇది చంద్రబాబు ప్రోద్బలమేనా? లేక.. వైసీపీపై నిజంగానే బాలయ్య కూడా.. ఆగ్రహంతో ఉన్నారా? అనే చర్చ జోరుగా సాగుతోంది. వాస్తవానికి చంద్రబాబుకంటే కూడా.. తన కుటుంబంపైనా.. ఎన్టీఆర్‌పైనా.. వైసీపీ నాయకులు చేస్తున్న విమర్శల విషయంలో బాలయ్య ఆగ్రహంతోనే ఉన్నారు.
ఇటీవల యూనివర్సిటీ కి పేరు మార్చడం కూడా.. ఆయనను మానసికంగా వేదనకు గురిచేసింది. ఈ నేపథ్యంలోనే బాలయ్య.. ఇలా.. వైసీపీ సర్కారును ఓడించేందుకు దక్కిన తొలి అవకాశం.. అంటూ.. పిలునిచ్చారని.. అంటున్నారు ప రిశీలకులు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.