Begin typing your search above and press return to search.
హిందూపురంలో బాలయ్య 'గడప గడపకు ఆరోగ్యం'!
By: Tupaki Desk | 3 Dec 2022 6:50 AM GMTఉమ్మడి అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గం నుంచి వరుస విజయాలు అందుకున్న నందమూరి బాలకృష్ణ.. ఈ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. నియోజకవర్గంలోని ప్రతి గడపకు గడపకు ఆరోగ్యం అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
ప్రత్యేకంగా ఆరోగ్య మొబైల్ వాహనాన్ని ఏర్పాటు చేసి..ఇక్కడి వారికి ఆరోగ్య సేవలు అందిస్తున్నారు. ఎన్టీఆర్ శత జయంతి వేడుకలనేపథ్యంలో ఈ వాహనాన్ని ఏర్పాటు చేసినట్టు ఎమ్మెల్యే కార్యాలయ వర్గాలు తెలిపాయి.
ప్రస్తుతం ప్రభుత్వ ఆధర్యంలో వైద్యారోగ్యశాఖ సేవలు అందిస్తోంది. అయితే, ఆసుపత్రికి కూడా రాలేని పరిస్థితిలో ఇంట్లోనే ఇబ్బందులు పడుతున్నవారికి ఈ సేవలను అందిస్తున్నట్టు ఎమ్మెల్యే బాలయ్య కార్యాలయం తెలిపింది. ఎన్టీఆర్ ఆరోగ్య రథం పేరిట బస్సును ఏర్పాటు చేశారు.
ఆత్యాధునిక వైద్య పరికరాలతో కూడిన ఈ వాహనం నియోజకవర్గంలోని హిందూపురం, చిలమత్తూరు, లేపాక్షి మండలాల్లో రోజూ ఓ గ్రామానికి వెళ్లి.. ప్రజలకు వైద్యం సేవలకు ఇంటి ముందే అందిస్తోంది. రోగ నిర్ధారణ పరీక్షలతో పాటు, ఖరీదైన మందులు ఉచితంగా ఇస్తున్నారు.
మరోవైపు.. ఎన్టీఆర్ శతజయంతి నేపథ్యంలో బాలయ్య సతీమణి వసుంధర సైతం నియోజకవర్గంలో మొబైల్ భోజన క్యాంటీన్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే.
ఈ సేవలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. కేవలం రెండు రూపాయలకే ఈ మొబైల్ వాహనం వద్ద భోజనం అందిస్తున్నారు. మొత్తానికి తన సొంత నియోజకవర్గంపై బాలయ్య ప్రత్యేక దృష్టి సారించారని పార్టీ నేతలు, అభిమానులు చెబుతున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.