Begin typing your search above and press return to search.
వైఎస్ జగన్ పాలనపై స్పందించిన బాలయ్య
By: Tupaki Desk | 7 Feb 2021 2:04 PM GMTపార్ట్ టైం పాలిటిక్స్ చేస్తూ సినిమాల్లో బిజీగా ఉన్న అగ్ర హీరో కం హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ సంచలన ప్రకటన చేశారు. ఏపీ సర్కార్ పై పోరుబాటు పట్టేందుకు రెడీ అయ్యారు. జగన్ ప్రభుత్వంపై తాజాగా మండిపడ్డారు.
ఆంధ్రప్రదేశ్ లో రాక్షస పాలన సాగుతోందని.. మన దురదృష్టమని బాలక్రిష్ణ వాపోయారు. నెల్లూరు జిల్లా నాయకులతో ఆదివారం బాలయ్య ఫోన్ లో మాట్లాడారు. పంచాయతీ ఎన్నికల ప్రచారాన్ని ఫోన్ లో నిర్వహించిన ఆయన కావలి మండలం రుద్రకోటలో టీడీపీ నేత కోటంరెడ్డి శ్రీనివాసుల రెడ్డితోపాటు కార్యకర్తలు, అభిమానులతో మాట్లాడారు.
ఉత్తర భారతదేశ రాష్ట్రాలలో ఇలాంటి పాలన చూశామని బాలక్రిష్ణ హాట్ కామెంట్స్ చేశారు. కార్యకర్తలు, అభిమానులతో తనది జన్మజన్మల అనుబంధమని.. ఎవరికి ఇబ్బంది వచ్చినా సహించనన్నారు.
సినిమా షూటింగ్ పూర్తయ్యాక రోడ్లమీదకి వస్తానని.. ప్రజలందరినీ కలుసుకుంటానని బాలక్రిష్ణ అన్నారు. ఏపీ ప్రభుత్వంపై యుద్ధం ప్రకటిస్తానని స్పష్టం చేశారు. బాలయ్య చేసిన ఈ ప్రకటన ఏపీ రాజకీయవర్గాల్లో సంచలనమైంది.