Begin typing your search above and press return to search.
జగన్ మీద బాలయ్య అన్ స్టాపబుల్ అటాక్
By: Tupaki Desk | 14 Jan 2023 4:36 PM GMTనందమూరి బాలక్రిష్ణ. వెండితెర మీద లక్షలాదిమందికి ఆరాధ్య కధానాయకుడు. మిగిలిన హీరోలతో పోలిస్తే బాలయ్యకు ఘనమైన సినీ నేపధ్యంతో పాటు రాజకీయ నేపధ్యం ఉంది. అందుకే ఆయన వెరీ స్పెషల్. ఆయన నోటి వెంట ఏ మాట వచ్చినా తూటాలాగానే పేలుతుంది. అది ఎవరికో గుచ్చినట్లుగా ఉంటుంది.
లేటెస్ట్ మూవీ వీర సింహారెడ్డిలో అనేకమైన పవర్ ఫుల్ డైలాగ్స్ ఉన్నాయి. అయితే వాటిని చిత్ర కధానాయకుడు విలన్ ని ఉద్దేశించి చెప్పినట్లుగా ఉన్నా ఏపీలో వర్తమాన రాజకీయ పరిస్థితులల్తో సరిపోల్చుకుంటూ జగన్ సర్కార్ మీద కౌంటర్స్ అని అంతా అనుకున్నారు అలాగే ప్రచారం సాగుతోంది.
అయితే బాలయ్య ఓపెన్ గా ఉంటారు. ఆయన బయట కూడా వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించడంలో వెనక్కి అసలు తగ్గరు. హిందూపురం ఎమ్మెల్యేగా బాలయ్య తన నియోజకవర్గం పర్యటనలో వైసీపీ ప్రభుత్వం మీద బాంబులే పేలుస్తారు. జగన్ ప్రభుత్వాన్ని ఎక్కడా స్పేర్ చేయరు.
అలాంటి బాలయ్య వీర సింహారెడ్డిగా వీరావేశం ప్రదర్శించే క్యారక్టర్ చేశాక దాన్ని జనాలు ఎంజాయ్ చేశాక ఊరుకుంటారా. ఊర మాస్ డైలాగ్స్ తో మీడియా ముందు కూడా ఒక రేంజిలో మాటల తూటాలను విసిరేస్తారు. ప్రస్తుతం తన బావ కం వియ్యకుడు అయిన మాజీ సీఎం చంద్రబాబు సొంత ఊరు నారావారి పల్లెలో సంక్రాతి పండుగకు వెళ్ళిన బాలయ్య ఈ సందర్భంగా చంద్రగిరిలోని ఒక థియేటర్ లో తాను నటించిన వీర సింహారెడ్డిని తిలకించి మరోమారు పులకించి పోయారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో సినిమా విశేషాల గురించి మాట్లాడుతూనే ఏపీ రాజకీయాల మీద కూడా పవర్ ఫుల్ డైలాగులు పేల్చారు. ఏపీలో ప్రస్తుతం ఎమెర్జెన్సీ పరిస్థితులు ఉన్నాయని బాలయ్య అనడం నేరుగా జగన్ సర్కార్ కి గుచ్చుకునేవే. ఏపీలో అంతా ఒక రకమైన భయాకన వాతావరణం ఉందని అన్నారు.
ఈ విషయం ప్రజలు అందరికీ తెలుసు అంటూ బాలయ్య తనదైన శైలిలో హాట్ హాట్ కామెంట్స్ చేశారు. బాలయ్య జగన్ సర్కార్ విషయంలో ఇంతటి పవర్ ఫుల్ డైలాగులు పేల్చడం పట్ల చర్చ సాగుతోంది. నిజానికి 2024 ఎన్నికలకు తెలుగుదేశం స్టార్ కాంపెయినర్ బాలయ్య అని అంటున్నారు. మరీ ముఖ్యంగా ఆయనకు రాయలసీమ బాధ్యతలను చంద్రబాబు అప్పగించచబోతున్నారు అని కూడా అంటున్నారు.
ఇక రాయలసీమ నేపధ్యంలో వీర సింహారెడ్డి మూవీ తీసిన బాలయ్య అందులో సీమ మీద తనకు ఎఫెక్షన్ ఉందని ఒక భారీ డైలాగ్ ద్వారా చెప్పుకున్నారు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురంలో మరోసారి గెలిచేందుకు అన్ని రకాల అనుకూల పరిస్థితులు ఉన్నాయి. బాలయ్యని ఢీ కొట్టే వైసీపీ అభ్యర్ధి అక్కడ లేరు అని అంటారు. పైగా వైసీపీలో వర్గ పోరు సాగుతోంది. దీంతో బాలయ్య హ్యాట్రిక్ ఎమ్మెల్యే కావడం ఖాయమనే అంటున్నారు.
దాంతో ఆయన తన సీటుని పక్కన పెట్టి సీమలో ఉన్న మొత్తం 51 ఇతర సీట్ల మీద ఫోకస్ పెడతారని మెజారిటీ టీడీపీ ఖాతాలో చేరేలా చూస్తారని అంటున్నారు. మొత్తానికి చూస్తే ఈసారి బాలయ్య తెలుగుదేశంలో కీలక పాత్ర మాత్రమే కాదు అగ్రెస్సివ్ రోల్ ప్లే చేయబోతున్నారు. దానికి ముందు టీజర్లే ఈ భారీ డైలాగులు అని అంటున్నారు. మరి జగన్ వర్సెస్ బాలయ్య అంటే ఈ రాజకీయ చిత్రం ఆసక్తిగా తిలకించేందుకు ఏపీ జనాలు వెయిటింగ్ అంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.