Begin typing your search above and press return to search.
ఇన్నాళ్లకు గోరంట్ల వీడియో బాలయ్యకు గుర్తుకు వచ్చింది
By: Tupaki Desk | 18 Aug 2022 4:38 AM GMTరాజకీయ నాయకుడికి ఏమున్నా లేకున్నా టైమింగ్ విషయంలో మాత్రం పక్కాగా ఉండాలి. ఈ విషయంలో చేసే పొరపాట్లతో జరిగే నష్టం భారీగా ఉంటుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో పెను రాజకీయ సంచలనంగా మారిన హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ కు చెందిన బూతు వీడియోగా చెబుతున్న వీడియో క్లిప్ ఎంతటి రచ్చ చేసిందన్న సంగతి తెలిసిందే. సున్నితమైన ఈ అంశం మీద అధికార.. విపక్షాలు ఒకరిపై ఒకరు ఎంతలా విరుచుకుపడ్డాయో తెలిసిందే. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న హిందుపురం అసెంబ్లీ పరిధిలో ఉంటే లోక్ సభ స్థానానికి ఎంపీగా వ్యవహరించే అధికార పార్టీ ఎంపీ చేసిన తప్పును ఎండగట్టే విషయంలో బాలయ్య టైమింగ్ ఏ మాత్రం బాగోలేదంటున్నారు.
హాట్ టాపిక్ గా మారిన ఈ ఇష్యూ గురించి బాలయ్య ఎప్పుడో స్పందించాల్సి ఉందని.. కానీ అందుకు భిన్నంగా ఈ ఇష్యూ ఇప్పటికే చిరాకుగా మారి.. దీనిపై ఇంత లొల్లి ఏంది? అన్న వరకు జనాలు వెళ్లిన వేళ.. బాలయ్య దీన్ని అందుకోవటం ఏమిటి? అన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా లేపాక్షిలో టీడీపీ నిర్వహిస్తున్న బాదుడే బాదుడు కార్యక్రమంలో పాల్గొన్న బాలయ్య.. వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ సభ్య సమాజం తలదించుకునే పని చేసినట్లుగా వ్యాఖ్యానించారు.
ప్రజలు ఎంతో నమ్మకంతో ఓట్లు వేసి మాధవ్ ను గెలిపిస్తే.. ప్రజలకు సేవ చేయకుండా నీలి చిత్రాలు చూపించారంటూ ఫైర్ అయ్యారు. ఏ ముఖం పెట్టుకొని ఎంపీ హిందూపురంలో జాతీయ జెండా ఎగురవేసేందుకు వచ్చారంటూ ప్రశ్నించారు. ఎంపీపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రజలకు స్పష్టం చేయాలన్న డిమాండ్ చూస్తే..
ఈ ఇష్యూపై ఇప్పటికే తెలుగు తమ్ముళ్లు ఎంత రచ్చ చేయాలో అంత చేశారు. నిజానికి అవసరానికి మించి చేశారన్న వాదన వినిపిస్తోంది. ఇలాంటి అంశాల్ని మరీ ఎక్కువగా మాట్లాడకుండా.. విలువలకు తిలోదకాలు ఇచ్చిన ఎంపీ మాధవ్ విమర్శలు చేసే అర్హత కూడా లేదని తేల్చేసి.. అతడ్ని తమ పార్టీ వెలి వేస్తుందన్నట్లుగా టీడీపీ తేల్చేసి ఉంటే గౌరవంగా ఉండేది.
అందుకు భిన్నంగా బూతు వీడియో మీద తరచూ చేసే వ్యాఖ్యలు మరింత ఇబ్బందిగా మారాయన్న విషయాన్ని టీడీపీ తమ్ముళ్లు గుర్తిస్తే మంచిది. ఇక.. బాలయ్య విషయానికి వస్తే.. ఇలాంటి ఇష్యూస్ పై ఆలస్యంగా స్పందించటం సరికాదన్న మాట పలువురి నోటి నుంచి వస్తోంది.
రాష్ట్ర అంశాల్ని ఎప్పుడు అడ్రస్ చేయని బాలయ్య.. కనీసం తన నియోజకవర్గ పరిధిలో జరిగి ఈ ఇష్యూను ఇంత ఆలస్యంగా రియాక్టు కావటమా? అన్న మాట పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇంతకీ గోరంట్ల పనిపై ఇన్నాళ్లకు ప్రశ్నించాలని అనిపించటం ఏమిటో?