Begin typing your search above and press return to search.
నా తండ్రి 6కోట్ల ఆప్ టికెట్ కొన్నాడు.
By: Tupaki Desk | 12 May 2019 7:16 AM GMTఆమ్ ఆద్మీ పార్టీలో మరో కలకలం రేగింది. ఆమ్ ఆద్మీ పార్టీ తరుఫున ఢిల్లీ నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీచేసేందుకు అభ్యర్థి బల్బీర్ సింగ్ జాకీర్ రూ. 6 కోట్ల రూపాయలు ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ కు ఇచ్చాడని.. స్వయంగా బల్బీర్ సింగ్ జాకీర్ కొడుకు సంచలన ఆరోపణలు చేశారు. టికెట్ కోసం 6 కోట్లు చెల్లించి కొనుక్కున్నాడని .. కోట్లకు నోటు స్కామ్ ఇది అని ఆరోపించాడు.
తాజాగా బల్బీర్ సింగ్ కొడుకు ఉదయ్ సింగ్ మాట్లాడుతూ.. ‘తన తండ్రి బల్బీర్ సింగ్.. ఆమ్ ఆద్మీ తరుఫున ఎన్నికల్లో పోటీచేసేందుకు అరవింద్ కేజ్రీవాల్ కు స్వయంగా 6 కోట్లు ఇచ్చాడు. తాను ఇందుకు సాక్షి. తన సమక్షంలోనే ఈ డబ్బులు ఇచ్చాడు’ అని దుమారం రేపారు.
తన తండ్రి జనవరిలోనే ఆమ్ ఆద్మీ పార్టీలో చేరాడని.. ఆరు నెలల కూడా కాకముందే టికెట్ పొందడం వెనుక డబ్బులే పనిచేశాయని ఉదయ్ సంచలనం రేపారు. అన్నా హజారే ఉద్యమంలో కూడా తన తండ్రి పాలుపంచుకోలేదని.. డబ్బులు ఉన్నవాళ్లకే ఆమ్ ఆద్మీలో టికెట్లు ఇచ్చారని విమర్శించారు. వెస్ట్ ఢిల్లీ నుంచి పోటీచేస్తున్న తన తండ్రి ఆప్ టికెట్ కోసం రూ.6కోట్లను అరవింద్ కేజ్రీవాల్, గోపాల్ రాయ్ లకు ఇవ్వడం తన సమక్షంలోనే జరిగిందని బాంబు పేల్చాడు.
అయితే తన కొడుకు ఉదయ్ సింగ్ చేసిన ఆరోపణలను బల్బీర్ సింగ్ ఖండించాడు. ఉదయ్ తనతోపాటు ఉండడం లేదని.. దూరంగా ఉంటున్నాడని.. అతడికి తనకు సంబంధం లేదని.. తాను రాజకీయాల గురించి ఎప్పుడూ కొడుకుతో చర్చించలేదని.. ఇన్వాల్వ్ చేయలేదని.. ఉదయ్ ఆరోపణలు వట్టి అబద్ధమని ఖండించారు.
బల్బీర్ తన భార్యతో 2009లోనే విడాకులు తీసుకున్నాడు. ప్రస్తుతం ఆయన భార్య, కొడుకు ఉదయ్ లు వేరుగా జీవిస్తున్నారు. ఇటీవల కాలంలో బల్బీర్ తన కొడుకుతో మాట్లాడలేదు.. కనీసం కలువలేదని సమాచారం.
అయితే ఈ ఆరోపనలపై బీజేపీ నేత ప్రవీణ్ ఖండేవాల్ ఈసీకి ఫిర్యాదు చేశాడు. ఆప్ టికెట్లను అమ్ముకుంటుందని ఫిర్యాదులో పేర్కొంది.