Begin typing your search above and press return to search.
చిరు బర్త్ డే పార్టీలో ‘బ్లాక్’ హవా
By: Tupaki Desk | 23 Aug 2015 5:28 AM GMTతన జీవితంలో ఏ పుట్టినరోజును ఇంత గ్రాండ్ గా మెగాస్టార్ జరుపుకోని ఉండరు. తన అరవయ్యో బర్త్ డే ని రెండు రోజుల పాటు గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్న చిరు.. తనకు తానే కాదు.. తనను అభిమానించే వారికి సైతం తీపి గురుతుగా మిగిల్చాడు. శుక్రవారం అభిమానులతో ముందస్తు పార్టీ చేసుకున్న చిరు.. శనివారం చిత్ర.. రాజకీయ ప్రముఖులతో కలిసి జరుపుకున్నారు. పరిశ్రమకు చెందిన నాటి.. నేటి తరం వారంతా చిరు బర్త్ డే ఫంక్షన్ లో తళుక్కుమన్నారు.
హైదరాబాద్ లోని గ్రాండ్ హయ్యత్ హోటల్ లో జరిగిన పుట్టినరోజు వేడుకులకు రాజకీయ రంగంతో పోలిస్తే చిత్ర పరిశ్రమకు చెందిన వారే ఎక్కువగా తరలి వచ్చారు. నిజానికి ఒక పెద్ద పార్టీ జరిగి.. అందులో భారీ ఎత్తున ప్రముఖులు హాజరైతే.. వారి వస్త్రధారణ గురించి ఒకింత ఆసక్తి ఉంటుంది. చిరు బర్త్ డే ఫంక్షన్ లో ఒక విశేషం మాత్రం కొట్టొచ్చినట్లు కనిపించింది.
చిరు బర్త్ డే ఫంక్షన్ కు హాజరైన ప్రముఖుల్లో అత్యధికంగా బ్లాక్ డ్రెస్ లలో మెరిసిపోయారు. ‘‘మెన్ ఇన్ బ్లాక్’’ అన్నట్లుగా బ్లాక్ సూట్ లతో టిప్ టాప్ గా రెఢీ అయ్యారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. రాజకీయ నాయకులు సైతం బ్లాక్ సూట్ లో మెరిసిపోవటం. చాలా తక్కువ మంది మాత్రమే బ్లాక్ డ్రెస్ కాకుండా వేరే కలర్ డ్రెస్ లతో వచ్చారు. పార్టీలు.. ఫంక్షన్లకు పెద్దగా హాజరు కాని చిరంజీవి తమ్ముడు పవన్ కల్యాణ్ సైతం ఈ బర్త్ డే ఫంక్షన్ కు బ్లాక్ సూట్ లో.. క్లీన్ షేవ్ చేసుకొని రావటం విశేషమే. డ్రెస్సింగ్ విషయంపై పెద్దగా ఆసక్తి చూపనట్లు వ్యవహరించే పవన్.. క్లీన్ షేవ్ లో బ్లాక్ సూట్ లో వావ్ అనిపించేలా హాజరయ్యారు. ఏపీ కాంగ్రెస్ సారథి రఘువీరారెడ్డి లాంటి నేతలు సైతం బ్లాక్ సూట్లో సరికొత్తగా కనిపించారు. చాలా కొద్ది మంది మాత్రమే వేరే కలర్ డ్రెస్ వేసుకున్నారు. చిరు సోదరుడు నాగబాబు ఫ్యామిలీ.. ఫ్యామిలీ బ్లాక్ తో అదరగొట్టేసింది.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి తనయుడు.. రాష్ట్ర మంత్రి కేటీఆర్ సైతం బ్లాక్ డ్రెస్ తో విచ్చేశారు. కాకుంటే మిగిలిన వారి మాదిరి సూటు.. బూటులో కాకుండా.. సింఫుల్ గా బ్లూ షేడెడ్ జీన్స్ మీద బ్లాక్ షర్ట్ వేసుకున్నారు. ప్రముఖుల్ని కలిసేందుకు వెళ్లే సమయంలో సూట్ వేసుకునే కేటీఆర్ అందుకు భిన్నంగా రావటం గమనార్హం. వెంకయ్యనాయుడు.. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు.. కోట శ్రీనివాసరావు.. దర్శకుడు బోయపాటి శ్రీను.. కె విశ్వనాధ్.. బి గోపాల్.. నాగ చైతన్య.. ఆది లాంటి కొద్ది మంది మాత్రమే బ్లాక్ కు దూరంగా ఉన్నారు.
ఇక.. బర్త్ డే బాయ్ చిరు మాత్రం బ్లూకలర్ స్పెషల్ డ్రెస్ లో స్పెషల్ గా.. స్టైల్ గా నలభైఏళ్ల యువకుడిలా కనిపించారు. ఆయనకు అరవైఏళ్లు అంటే ఏ మాత్రం నమ్మని రీతిలో ఉండటం గమనార్హం.
ఇదిలా ఉంటే.. ఈ పార్టీకి హాజరైన నాటి.. నేటి హీరోయిన్లు.. మహిళా ప్రముఖులు మాత్రం వేర్వేరు రంగుల్లో తళతళలాడిపోయారు. చాలా కొద్ది మంది మాత్రమే బ్లాక్ లో మెరిశారు. చాలా ఫంక్షన్ లో ఎవరికి వారు.. వేర్వేరు స్టైలింగ్ తో కనిపించే దానికి భిన్నంగా బ్లాక్ డ్రెస్ కోడ్ అన్నట్లుగా రావటంతో.. దూరం నుంచి ఎవరు ఎవరో అర్థం కాని పరిస్థితి. ప్రముఖులంతా సూట్లలో హాజరు కావటంతో పార్టీలో హైలుక్ కొట్టొచ్చినట్లు కనిపించింది. తెలుగు ఆహార్యంలో కనిపించిన ఒకే ఒక్క వ్యక్తి కేంద్రమంత్రి వెంకయ్యనాయుడిగా చెప్పొచ్చు.