Begin typing your search above and press return to search.
సిక్కు మత గురువు 1500 మందికి అంటించేశాడా?
By: Tupaki Desk | 29 March 2020 6:34 AM GMTకరోనా వైరస్ సోకి 70 ఏళ్ల సిక్కు మతగురువు బలదేవ్ సింగ్ తాజా మరణం.. ఇప్పుడు షాకింగ్ గా మారింది. కొద్దిరోజుల క్రితం యూరప్ లోని ఇటలీ.. జర్మనీకి వెళ్లి వచ్చిన ఆయన కరోనా కారణంగా మరణించటంతో.. గ్రామాలకు గ్రామాలు క్వారంటైన్ లో పెట్టేశారు. దీనికి కారణం లేకపోలేదు.
తన విదేశీ పర్యటన తర్వాత భారత్ కు చేరుకున్న తర్వాత.. ఏ మాత్రం విశ్రాంతి తీసుకోలేదు. ఏకంగా పన్నెండు గ్రామాల్లో తిరిగి మత బోధనలు చేశారు. ఇప్పుడుకరోనా పాజిటివ్ తో ఆయన మరణించటంతో.. ఇటీవల కాలంలో ఆయన మరణించిన తరువాత అన్ని గ్రామాల్ని.. ఆయనకు సన్నిహితంగా ఉన్న వారిని క్వారంటైన్ చేయాలని నిర్ణయించారు. పంజాబ్ రాష్ట్రంలో పెను సంచలనంగా మారిన ఈ ఉదంతం లో ఎంతమంది ప్రభావితమై ఉంటారన్నది ప్రశ్నగా మారింది.
ప్రాథమికంగా వేసిన అంచనా ప్రకారం.. బలదేవ్ సింగ్ కు సన్నిహితంగా అనుచరులు.. ఆయన్ను అభిమానించే వారు దగ్గర దగ్గర 1500 మందికి కరోనా వ్యాపించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. బలదేవ్ సింగ్ ఇద్దరు శిష్యులకు కరోనా పాజిటివ్ గా తేలటంతో.. కంగారు మరింత పెరిగింది. ఇప్పటికే ఆయన్ను కలిసిన 19 మందికి కరోనా సోకటం.. మరో 200 మందికి చెందిన రిపోర్టులు రావాల్సి ఉండటంతో ఉత్కంట పెరిగిపోతోంది. దేశంలో ఇప్పటివరకూ నమోదైన కేసుల్లో.. ఒకరి కారణంగా పెద్ద సంఖ్యలో కరోనా వ్యాపింపచేసిన వారిలో ఈ సిక్కు మత గురువు కూడా ఒకరవుతారన్న అంచనా వ్యక్తమవుతోంది.