Begin typing your search above and press return to search.

అనూహ్యం కొన్ని అదృష్టం కొంత

By:  Tupaki Desk   |   11 April 2022 4:30 AM GMT
అనూహ్యం కొన్ని అదృష్టం కొంత
X
ఆ పాటి అదృష్టం చెవిరెడ్డికి లేకుండా పోయింది. ఆ పాటి క‌ష్టం గుర్తింపులో లేకుండా పోయింది. మంగ‌ళ‌గిరి ఎమ్మెల్యే రామ‌కృష్ణ‌కు ప‌ద‌వి ఇస్తే బాగుండు అన్న మాట విన‌ప‌డుతోంది కానీ అయ్యే అవ‌కాశాలే లేవు. బాలినేని క‌న్నెర్ర జేస్తున్న‌డు. ఆయ‌న కు ప‌ద‌వి లేదు అదే జిల్లాకు చెందిన ఆదిమూల‌పు సురేశ్ కు ప‌ద‌వి ఇచ్చి గౌర‌వం ఇచ్చారు. ఆ విధంగా మామ బాధ‌ప‌డుతున్నాడు.

హై బీపీ తెచ్చుకుని అవ‌స్థ ప‌డుతున్నాడు. ప్ర‌స్తుతానికి ఆయ‌న ఆరోగ్యం నిల‌క‌డ‌గా ఉన్నా ఆయ‌న లోప‌లి మ‌నిషి ఇవేవీ ఒప్పుకోవ‌డం లేదు. సీఎం సొంత మ‌నుషుల‌కు ఛాన్స్ ఇవ్వ‌లేదు. చెవిరెడ్డి, భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి లాంటి భ‌క్తులు ఏమ‌యిపోయినా ప‌ర్లేదు అని సీఎం వ‌దిలేశారు. కోటంరెడ్డి ఏడుపు కార‌ణంగా ఏ మార్పూ రాదు అని కూడా తేలిపోయింది.

ఆ రోజు ఆయ‌న తో న‌డిచిన వాళ్లంద‌రూ ఇప్ప‌టికీ ఎమ్మెల్యేలే కానీ మంత్రులు కాలేదు. కాబోరు కూడా ! కొడాలి నాని కూడాఏదో ప‌ద‌వితో సంతృప్తి చెందాలే త‌ప్ప అక్క‌డ ద‌క్కిన ప్రాధాన్యం ఏమీ లేదు. క‌నుక మంత్రులు అత్యుత్సాహం త‌గ్గించుకుని ప‌ని చేస్తే బెట‌ర్ అని ఈ క‌థ చెప్పిన నీతి.

అల‌క పాన్పుపై కొంద‌రు..అంద‌లంపై ఇంకొంద‌రు.. ఈ రెండూ ఇప్పుడు క‌నిపిస్తున్న దృశ్యాలు. ఆంధ్రావ‌నిలో క్యాబినెట్ విస్త‌ర‌ణ‌కు సంబంధించి చివ‌రి నిమిషం వ‌ర‌కూ పేర్లు మారుతూనే ఉన్నాయి. ఒక్క పేరు కూడా స్ప‌ష్ట‌త‌కు నోచుకోలేదు. రెండు సార్లు ఫైన‌ల్ లిస్ట్ ను మార్చారు. దీంతో ఆఖ‌రి వ‌ర‌కూ గంద‌రగోళ‌మే నెల‌కొంది. సుదీర్ఘ మంత‌నాలు జ‌రిపాక సీఎం సాధించింది ఏమీ లేదు. పాత వారిని కొన‌సాగించ‌డంలో నియంత్ర‌ణ పాటిస్తారు అని అనుకున్నా అది కూడా కాకుండా పోయింది.

తొలుత ఐదుగురు పాత మంత్రుల‌ను కొన‌సాగిస్తామ‌ని చెప్పిన ముఖ్య‌మంత్రి త‌రువాత ఆ సంఖ్య‌ను 11 కు చేర్చి ఆశ్చ‌ర్య‌ప‌రిచారు. కొన్ని పేర్లు అనూహ్యంగా తెర‌పైకి వ‌చ్చి అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచాయి. ఆఖ‌రిని బాలినేని శ్రీ‌నివాస్ కు ప‌ద‌వి లేకుండా పోయింది. బూతుల మంత్రిగా పేరున్న నానికి కూడా నో ఛాన్స్ కానీ అప్ప‌టిక‌ప్పుడు ఏపీ డెవ‌ల‌ప్మెంట్ కార్పొరేష‌న్ చైర్మ‌న్ ప‌ద‌వి కేటాయించి క‌మ్మ సామాజిక‌వ‌ర్గాన్ని సంతృప్తి ప‌రిచేందుకు ప్ర‌య‌త్నాలు చేశారు.