Begin typing your search above and press return to search.

హరీష్ రావుకి మంత్రి బాలినేని కౌంటర్.. 4వేల కోట్లు ప్రజలకే - మేము జేబులో వేసుకోము!

By:  Tupaki Desk   |   25 Sep 2020 4:30 PM GMT
హరీష్ రావుకి మంత్రి బాలినేని కౌంటర్.. 4వేల కోట్లు ప్రజలకే - మేము జేబులో వేసుకోము!
X
కేంద్రం ఇచ్చే రూ. 4 వేల కోట్ల కోసం ఆశపడి రైతుల పంప్ సెట్లకు ఏపీ సీఎం జగన్ మీటర్లు పెడుతున్నారని , మేము ఆలా చేయడం లేదని రైతుల మంచే మాకు కావాలని అదరగొడుతున్న తెలంగాణ మంత్రి హరీష్ రావు కి ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి , సుతిమెత్తగా కౌంటర్ ఇచ్చినట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. రైతులకు ఉచిత విద్యుత్ బోర్లకు మీటర్లు అమర్చే విషయంలో కేంద్రంతో సఖ్యతగా ఉంటూ కష్టాల్లో ఉన్న రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రానికి మద్దతు ఇచ్చామని , కేంద్రం ఇచ్చే రూ.4వేల కోట్ల సొమ్ముని ప్రజల అభివృద్ధికి ఉపయోగిస్తామే తప్ప అవి తమ జేబుల్లో వేసుకోమనే విషయాన్ని తెలంగాణ మంత్రి హరీష్ రావు గ్రహించాలని మంత్రి కోరారు.

అలాగే , ఎట్టిపరిస్థితుల్లో కూడా రైతులకు అందించే ఉచిత విద్యుత్ విషయంలో రాజీపడబోమని మంత్రి బాలినేని స్పష్టం చేశారు. మరో 30 ఏళ్ల పాటూ రైతులకు ఉచిత విద్యుత్ అందించే విషయంలో మాట తప్పమని రైతులకు హామీ ఇస్తున్నామన్నారు. డిస్కంలకు చెల్లించవలసిన బిల్లును కూడా నేరుగా రైతుల అకౌంట్లలో ముందుగానే డబ్బులు జమ చేస్తున్నామని చెప్పారు. దీనిపై ఎవ్వరూ అనుమాన పడవలసిన అవసరం లేదని అన్నట్టు తెలుస్తుంది. కేంద్రంతో ఓ రోజు మంచిగా ఉండటం, మరో రోజు గొడవ పడటం కాకుండా రాష్ట్ర అభివృద్ధి కోసం దీర్ఘకాలిక సఖ్యత అవసరమని భావిస్తున్నట్లు బాలినేని తెలిపారు

కేంద్రం రైతులను నిండా ముంచాలని చూస్తోందని, అందుకే సీఎం కేసీఆర్ ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించారన్నారు. మీటర్లు వద్దు, బిల్లులు వద్దంటూ తేల్చిచెప్పారని.. రైతు సంక్షేమమే ముఖ్యమని భావించి, రైతు ఉపయోగించే ప్రతి బావికి, బోరుకు విద్యుత్‌ మీటర్‌ పెడితే , తెలంగాణకు రూ.2500 కోట్లు, ఆంధ్రప్రదేశ్ ‌కు రూ.4వేల కోట్లు ఇస్తామని కేంద్రం చెప్పిందని, అయితే , దాన్ని తెలంగాణ ప్రభుత్వం తిరస్కరించిందని, కానీ రూ.4 వేల కోట్లకు ఆశపడిన ఏపీ సర్కార్ ఆ డబ్బు తెచ్చుకుని ఇప్పుడు మీటర్ల పేరుతో ఆంధ్రా రైతుల మెడకు ఉచ్చు బిగిస్తున్నారని చెప్పారు. దీనిపై తాజాగా మంత్రి బాలినేని మంత్రి హరీష్ రావు కి కౌంటర్ ఇచ్చినట్టు మీడియా వర్గాల ద్వారా తెలుస్తుంది.