Begin typing your search above and press return to search.
చైనా ఆక్రమణ పై కథనాన్ని రాసిన జర్నలిస్ట్ అనుమానాస్పద మృతి
By: Tupaki Desk | 15 Aug 2020 4:30 PM GMTఈ మధ్య కాలంలోనే తమ గ్రామాన్ని చైనా ఆక్రమించింది అంటూ ఓ వార్త రాసిన నేపాల్ కు చెందిన ఓ జర్నలిస్ట్ అనుమానాస్పద రీతిలో మరణించారు. ఈ నెల 11 న కనిపించకుండా పోయిన ఈ జర్నలిస్ట్, రెండు రోజుల తర్వాత శవమై కనిపించారు. నేపాలీ దినపత్రిక కాంతిపూర్ డైలీలో రిపోర్టర్ గా ఉద్యోగం చేస్తున్ బలిరామ్ బనియా.. నేపాల్ కు చెందిన రూయి అనే గ్రామాన్ని చైనా ఆక్రమించిందని పూర్తి ఆధారాలతో సహా ఓ కథనాన్ని అందించారు. ఈ గ్రామంలో గత 60 ఏళ్లుగా చైనా పాలన కొనసాగిస్తున్నదని, అయినప్పటికీ నేపాల్ ప్రభుత్వం దీన్ని ఎన్నడూ కూడా వ్యతిరేకించలేదని అందులో పొందుపరిచారు.
నేపాల్ ప్రభుత్వ అధికారిక పటంలో నేపాల్ సరిహద్దులోని ఈ గ్రామంలో కూడా చూపిస్తున్నదని, రూయి గ్రామ ప్రజల నుంచి పన్నులు వసూలు చేసినట్లు గూర్ఖా జిల్లాలోని రెవెన్యూ కార్యాలయంలో పత్రాలు కూడా దీనిని స్పష్టంచేస్తున్నాయని , అయితే ఈ గ్రామం గురించి నేపాల్ ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్లనే చైనా ఆక్రమించుకున్నదని ఆ కథనంలో పొందుపరిచారు. ఈ సంగతి ఇలా ఉండగానే అయన కనిపించకుండా పోయారు.
ఆగస్టు 11 నుంచి కనిపించకుండా పోయిన బలరామ్ బనియా.. 13న మండు జిల్లాలోని బాగ్మతి నది ఒడ్డున ఉన్న జలశక్తి ప్రాజెక్టు సమీపంలో అతని మృతదేహం లభ్యమైంది. బనియా ముఖంలో గాయాలు ఉన్నట్టు పోలీసులు చెప్తున్నారు. బనియా చివరిసారిగా గురువారం బాల్ఖు నది ఒడ్డున నడుస్తూ కనిపించినట్లు స్థానికులు చెప్తున్నారు. అతడి మొబైల్ ఫోన్ చివరి సిగ్నల్స్ అక్కడే ఆగిపోయాయి అని తెలుస్తున్నది. బనియా అదృశ్యం గురించి స్థానిక పోలీస్ స్టేషన్లో ఆయన కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. ఈ మృతి పై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపి దోషులను పట్టుకోవాలని నేపాల్ ప్రెస్ యూనియన్ డిమాండ్ చేసింది.