Begin typing your search above and press return to search.

కోదండ‌రాం...క‌ర్త‌, క‌ర్మ‌, క్రియా ఆ ఒక్క‌డే

By:  Tupaki Desk   |   23 Feb 2017 8:05 AM GMT
కోదండ‌రాం...క‌ర్త‌, క‌ర్మ‌, క్రియా ఆ ఒక్క‌డే
X
తెలంగాణ జేఏసీ చైర్మ‌న్ ప్రొఫెస‌ర్ కోదండరాం నిరుద్యోగ ర్యాలీపై టీఆర్ ఎస్ ఎంపీ బాల్క సుమన్ విమ‌ర్శ‌లు వేశారు. ర్యాలీని నిరుద్యోగ యువత పట్టించుకోలేద‌ని, అందుకు వారికి కృతజ్ఞతలని అన్నారు. రాష్ట్ర యువ‌త నిర‌స‌న‌ల‌కు దూరంగా ఉండి సీఎం కేసీఆర్ పట్ల తమ విశ్వాసాన్ని చాటారని అన్నారు. చాలామంది విద్యార్థులు శ్రద్దగా చదువుకుంటున్నారని కొంత మంది విద్యార్థులు పాల్గొంటున్న ఆందోళనలను పెద్దదిగా చూపించే ప్రయత్నం సరికాదని బాల్క సుమ‌న్‌ అన్నారు. తెలంగాణను అభివృద్ధి పథం లో తీసుకెళ్తున్న సీఎం కేసీఆర్ కు ప్రజలు అండగా ఉన్నార‌ని, నిరుద్యోగుల భవిష్యత్ కు కేసీఆర్ దే భరోసా అని చెప్పారు.

తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యంలో జేఏసీ చైర్మన్ గా కోదండరాంను నియమించింది కేసీఆరేన‌ని బాల్క సుమ‌న్ తెలిపారు. జేఏసీ ఉద్యమాల్లో పలికింది కోదండరాం అయినా పలికించింది కేసీఆరేన‌ని ఆయ‌న చెప్పారు. కోదండరాం ఏదో ఊహించుకుని నిన్న భంగపడ్డారని ఎద్దేవా చేశారు. తెలంగాణ ఓ విఫల ప్రయోగం అని చెప్పే కుట్రలో భాగంగానే కోదండరాం నిన్నటి ర్యాలీకి పిలుపునిచ్చారని ఆరోపించారు. కోదండరాంకు మద్దతు ఇస్తున్న తెలంగాణ టీడీపీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి - టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి - సీపీఎం రాష్ట్ర కార్య‌ద‌ర్శి తమ్మినేని వీరభద్రం తెలంగాణ వాదులా? అని ప్ర‌శ్నించారు. కోదండరాం తన రాజకీయ స్వార్థం కోసం నిరుద్యోగ యువతను రెచ్చ గొడుతున్నారని ఆరోపించారు. హైదరాబాద్ విశ్వనగరంగా మారుతున్న పరిస్థితిని చెడగొట్టేందుకు కోదండరాం యత్నిస్తున్నారు. శాంతి భద్రతలు చెడగొట్టేందుకు కోదండరాం ప్రయత్నిస్తున్నారని బాల్క సుమ‌న్‌ ఆరోపించారు. ఇకనైనా ఇలాంటి కుట్రలను కోదండరాం మానుకోవాలని కోరారు.

నీళ్లు-నిధులు-నియామకాల విషయంలో కేసీఆర్ పూర్తి స్పష్టత తో ముందుకు సాగుతున్నార‌ని సుమ‌న్ తెలిపారు. రాష్ట్రం ఏర్పడగానే సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవ చూపి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేయించారని వివ‌రించారు. నికార్సయిన తెలంగాణ వాదులతో లక్షా ఏడు వేల ఉద్యోగాల భర్తీ దశల వారీగా కొనసాగుతోందని చెప్పారు. తెలంగాణ విఫల ప్రయోగం అని చెప్పేందుకు కోదండరాం మరిన్ని కుట్రలకు తెరలేపే అవకాశముందని, ఇలాంటి కుట్రల పట్ల తెలంగాణ సమాజం అప్రమత్తంగా ఉండాలి. తెలంగాణకు కేసీఆరే శ్రీరామ రక్ష అని గుర్తించాలని కోరారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/