Begin typing your search above and press return to search.
బాల్క సుమన్ ట్రాప్ లో కోదండరాం పడతారా?
By: Tupaki Desk | 1 Jan 2017 6:18 AM GMTతెలంగాణ ఉద్యమంలో కలిసి నడిచిన ప్రొఫెసర్ కోదండరాం ఇప్పుడు తనను ఇరుకునపెడుతుండడంతో ఆయన్ను ఎదుర్కొనే మార్గం లేక కుల అస్ర్రాన్ని ప్రయోగిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నయానాభయాన చెప్పి చూసినా కోదండం రాం తాను పట్టిన పట్టు విడవకపోవడంతో ఆయనపై బురద జల్లేందుకే కేసీఆర్ డిసైడ్ అయ్యారని టాక్. అందులో భాగంగానే కుల అస్ర్తం ప్రయోగించినట్లు టాక్.
తెలంగాణ సర్కారు ఏర్పడిన దగ్గర నుంచీ ఇప్పటివరకూ కేసీఆర్… కోదండరాం మధ్య గ్యాప్ పెరుగుతూ వచ్చింది. దీంతో ముఖ్యమంత్రి కేసీఆర్ తనదైన శైలిలో కోదండరాంను పక్కనబెడుతూ వచ్చారు. దీనికి ధీటుగా కోదండరాం.. సర్కారు తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ లోపాలను వెతుకుతూ వాటిపై పోరాడుతున్నారు. విపక్షాలు కోదండరాంకు మద్దతు పలుకుతున్నాయి. మరోవైపు కోదండరాంను ప్రభుత్వంలోని అగ్రవర్ణ మంత్రులు, ఎంపీలు విమర్శిస్తుంటే…అది టీఆర్ ఎస్ సర్కారుకు మైనస్ అవుతోంది. ప్రజల్లో కోదండరాంపై వున్న అభిమానం వల్ల..ఎదురుదాడికి దిగితే..బూమరాంగ్ అవుతోందని ప్రారంభంలోనే గుర్తించారు కేసీఆర్. అందుకే చివరిదైన కులాస్త్రాన్ని బయటకు తీశారు. కోదండరాం రెడ్డి సామాజికవర్గానికి చెందినవారు. ఆయనపై ఓ ఎస్సీ నేతతో మాటల దాడి చేయిస్తే…ఏదో ఒక సందర్భంలో కౌంటర్ ఎటాక్ కు దిగి నోరుజారితే..ఎస్సీల వ్యతిరేకి అనే ముద్ర వేయడంతోపాటు..ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు కూడా బనాయించొచ్చనే వ్యూహంతో ముందుకెళుతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి.
కోదండరాం ప్రభుత్వంపై విమర్శలు చేసిన ప్రతిసారీ..ఎస్పీ ఎంపీ అయిన బాల్క సుమన్ ను కౌంటర్ ఎటాక్ కు దింపుతున్నారు. సుమన్ తన నోటికి పనిచెబుతూ కోదండరాంను కవ్విస్తున్నారు. నాలుక చీరేస్తా! కాంగ్రెస్ ఏజెంట్ అంటూ కోదండరాంపై ఘాటుగా విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పటివరకూ కోదండరాం కానీ, ఆయన అనుయాయులుగానీ సుమన్ వ్యాఖ్యలను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. అయినా బాల్క సుమన్ తన దాడిని కొనసాగిస్తున్నారు.
తాజాగా కోదండరాంపైకి 20 ప్రశ్నలు సంధిస్తూ ప్రకటన విడుదల చేశాడు బాల్క సుమన్. వీటికి ప్రొఫెసర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశాడు. అయితే... బాల్క సుమన్ బాణానికి కోదండరాం పడతారన్నది అనుమానమే అని.. కోదండరాం నిదానంగా, ఆలోచించి స్పందిస్తారు కాబట్టి ఆయన ఈ ట్రాప్ లో పడకపోవచ్చని అంటున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/