Begin typing your search above and press return to search.
కోదండం సార్ అంటూ శిష్యుడి తాజా మాట షాకే
By: Tupaki Desk | 18 Jun 2017 7:17 AM GMTరాజకీయాల్లో ఏదీ శాశ్వితం కాదు. ఆ మాటకు వస్తే.. జీవితంలోనూ ఏదీ శాశ్వితం కాదు. ఒకప్పుడు దైవంగా కొలిచిన వారే..తర్వాతి రోజుల్లో దెయ్యాలుగా కనిపిస్తుంటారు. అందుకు తాజా నిదర్శనంగా ఈ ఉదంతాన్ని చెప్పాలి. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెలంగాణ రాజకీయ ఐకాస ఛైర్మన్ గా వ్యవహరించిన కోదండరాంకి.. ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థి నాయకుడిగా సుపరిచితుడైన బాల్క సుమన్ కు మధ్య అనుబంధం ఎంతటిదన్నది అందరికి తెలిసిందే. గురువు అడుగుజాడల్లో నడుస్తూ.. టీఆర్ ఎస్ కు దగ్గరైన సుమన్ కు ఒకప్పుడు గురువు మాట అంటే వేదవాక్కు మాదిరిగా ఉండేది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం.. టీఆర్ ఎస్ పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేసిన సుమన్.. సంచలన విజయాన్ని సాధించటంతో ఒక్కసారిగా ఆయన ఎంపీ అయిపోయారు. విద్యార్థి నాయకుడిగా ఉన్న తనను ఎంపీగా చేసిన కేసీఆర్ ను ఆయన ఎంతగా అభిమానిస్తారో.. మరెంతగా ఆరాధిస్తారన్నది ఆయన మాటల్ని విన్నప్పుడు ఇట్టే అర్థమవుతుంటుంది. అధినేతకు నమ్మిన బంటుగా వ్యవహరించే క్రమంలో.. తన మాటలతో తెలంగాణ సర్కారును ఇబ్బంది పెట్టే ఒకనాటి గురువు కోదండరాంపై సుమన్ విరుచుకుపడుతుంటారు. తీవ్ర విమర్శలు చేస్తారు.
ఆ మాటకు వస్తే.. కోదండరాం మాష్టార్ని వెనుకా ముందు చూసుకోకుండా విమర్శలు చేసే వారిలో బాల్క సుమన్ ముందుంటారని చెప్పక తప్పదు. మాష్టారిపై విమర్శలు చేసేందుకు.. ఆయనపై మాటల దాడికి బాల్క సుమన్ ఉత్సాహాన్ని ప్రదర్శిస్తుంటారన్న ఆరోపణ ఉంది. తాజాగా తన నోటికి మరోసారి పని చెప్పారు. కోదండరాం సార్ అంటూనే.. ఆయనపై తీవ్ర విమర్శలు చేశారు సుమన్.
తెలంగాణ రాజకీయ ఐకాస ఛైర్మన్ గా చెలామణి అవుతున్న కోదండరాం సార్‌కు కాంగ్రెస్ పాలన ఇంపుగా.. టీఆర్ఎస్ పాలన కంపుగా కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. కేసీఆర్ సర్కారును బద్నాం చేస్తున్న కోదండరాం ద్రోహ పాత్రను టీఆర్ఎస్ శ్రేణులు అడుగడుగునా అడ్డుకోవాలన్నారు.
తాజాగా నామినేటెడ్ పోస్టుల్ని పొందిన గుండు సుధారాణి.. వాసుదేవరెడ్డి తదితరుల్ని సన్మానించేందుకు హన్ముకొండలో ఏర్పాటు చేసిన సభలో ఆవేశంగా మాట్లాడిన సుమన్.. కోదండరాం సార్‌ను ఎక్కడికక్కడ నిలదీయాలని... అడ్డుకోవాలంటూ టీఆర్ ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున తన అనుచరులు కొందరికి కోదండరాం టిక్కెట్లు ఇప్పించుకున్నారని.. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడి టీఆర్ఎస్ పవర్ లోకి రావటాన్ని ఓర్వలేకపోతున్నారన్నారు.
అందుకే.. కోదండరాం సార్ ఎక్కడ పర్యటించినా అడ్డుకోవాలని.. నిలదీయాలని ప్రశ్నించారు. టీఆర్ ఎస్ సర్కారును బద్నాం చేస్తున్న కోదండరాం ద్రోహ పాత్రను అడుగడుగునా నిలదీయాలని ఆయన పిలుపునిస్తున్నారు. ఒకప్పటి గురువును అడ్డుకోవాలంటూ ఫైర్ అవుతున్న శిష్యుడి మాటలు ఇప్పుడు సంచలనంగా మారాయి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/