Begin typing your search above and press return to search.

రేవంత్ రవ్వంత...కేసీఆర్ ఆకాశమంత

By:  Tupaki Desk   |   11 Dec 2017 4:37 AM GMT
రేవంత్ రవ్వంత...కేసీఆర్ ఆకాశమంత
X
తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పి ఇటీవ‌ల కాంగ్రెస్‌ లో చేరిన ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి స్థాయి రవ్వంత అయితే...తెలంగాణ సీఎం కేసీఆర్ స్థాయి ఆకాశమంత అని కేసీఆర్ కుటుంబ స‌న్నిహితుడుగా పేరున్న‌ టీఆర్ ఎస్ ఎంపీ బాల్క సుమన్ వ్యాఖ్యానించారు. గాంధీభ‌వ‌న్‌ లోకి మొద‌టి సారి వ‌చ్చిన సంద‌ర్భంగా, సోనియాగాంధీ జ‌న్మ‌దిన నేప‌థ్యంలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సుమన్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కొత్త బిచ్చగాడు పొద్దెరగడు అన్నట్టు రేవంత్‌ ప్రవర్తిస్తున్నాడని...సంస్కార హీనంగా మాట్లాడుతున్నారని మండిప‌డ్డారు. అయితే త‌మ‌కు రేవంత్ రెడ్డి గురించి ఆలోచించే టైం లేదంటూనే రేవంత్‌ పై విరుచుకుప‌డ్డారు.

కేసులు అంటే రేవంత్‌కు సోకు ఉన్న‌ట్లుగా ఉంద‌ని వ్యాఖ్యానించిన‌ ఎంపీ సుమన్ మంత్రి కేటీఆర్‌ పై బాధ్య‌తారాహిత్య‌మైన వ్యాఖ్య‌లు చేశార‌ని మండిప‌డ్డారు. `కేటీఆర్ కు పెళ్లి అయింది ఎప్పుడు - ఆయన ఉద్యోగం చేసింది ఎప్పుడు..ఆనాటికి పుట్టని టీఆర్ ఎస్ కు అంట గట్టటం పిచ్చి మాటలే..నిన్న మొన్నటి వరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్ - టీడీపీ లు ఎందుకు దీనిపై విచారణ జరపలేదు?`` అంటూ రేవంత్ చేసిన విమ‌ర్శ‌ల‌ను ఎంపీ బాల్క సుమ‌న్ ఘాటుగా తిప్పికొట్టారు. 120 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ ఇలాంటి చిల్లరగాళ్లను ఎలా చేర్చుకుంటుంద‌ని ప్ర‌శ్నించారు. కాంగ్రెస్ నేతల భార్యలది ఏ కులమ‌ని తాము ఆడిగిన‌మా అని సుమ‌న్ ప్ర‌శ్నించారు. `మీ చరిత్రలు కూడా తవ్వమంటారా? వ్యక్తి గత విమర్శలు చేస్తే వేదిక మీద ఉన్న నాయకులు ఎందుకు మాట్లాడరు? మణిశంకర్ అయ్యర్ ను సస్పెండ్ చేసిన కాంగ్రెస్ రేవంత్ రెడ్డి పై ఎందుకు చర్యలు తీసుకోరు.` అంటూ ఎంపీ సుమ‌న్ సూటిగా ప్ర‌శ్నించారు.

వెకిలి ప్రయత్నాలు మానుకోవాలి కాంగ్రెస్ నేతల వ్యక్తిగత జీవితాలు బయట పెట్టాలనుకుంటే రోజుకో 50 మంది చిట్టా బయటపెడతామని సుమన్ హెచ్చ‌రించారు. మొరిగె కుక్కలకు తెలంగాణ ప్రజలే బుద్ది చెబుతారని ఎంపీ బాల్క సుమ‌న్ అన్నారు. `రేవంత్ జర నీ ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు బిడ్డ` అని హెచ్చ‌రించారు. రేవంత్ ను తెలంగాణ ప్రజలు బొంద పెడతరని స్ప‌ష్టం చేశారు. తెలంగాణే...కేసీఆర్ కులం మతం అని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. కోర్టుల్లో కేసీఆర్ అభిమానులు ఉన్నారని.. వారు రేవంత్ నోటిని ఫినాయల్ తో కడుగుతార‌ని ఎంపీ సుమ‌న్ అన్నారు.