Begin typing your search above and press return to search.
అసెంబ్లీలో బాల్కసుమన్ ప్రేమకథ..
By: Tupaki Desk | 25 Feb 2019 11:12 AM GMTతెలంగాణ శాసనసభ డిప్యూటీ స్పీకర్ గా పద్మారావు గౌడ్ ఈరోజు ఎన్నికై బాధ్యతలు చేపట్టారు. ఈసందర్భంగా సీఎం కేసీఆర్, ప్రతిపక్ష కాంగ్రెస్, టీఆర్ ఎస్ సభ్యులు ఆయనతో ఉన్న అనుబంధాన్ని పంచుకొని అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైనా చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ కూడా అసెంబ్లీలో ఈరోజు తన మొట్టమొదటి ప్రసంగాన్ని వినిపించారు. 30ఏళ్లకే పార్లమెంట్ లో .. 35కే అసెంబ్లీలో అడుగుపెట్టడం అంబేద్కర్, సీఎం కేసీఆర్ దయ అని కొనియాడారు. ఈ సందర్భంగా పద్మారావు గౌడ్ తో తనకున్న అనుబంధాన్ని సుమన్ గుర్తు చేసుకున్నారు. ఇదే కోవలో తన లవ్ స్టోరీని కూడా అసెంబ్లీలో గుర్తు చేసుకొని.. దానికి డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ సహాయం ఉందంటూ ప్రేమకథను చెప్పుకొచ్చారు.
బాల్క సుమన్ మాట్లాడుతూ ‘ఉద్యమ సమయంలో టీఆర్ ఎస్ విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నప్పుడు 2012లో తాను ఒక అమ్మాయిని ప్రేమించానని.. ఆమె గౌడ్ సామాజికవర్గం కావడంతో పాటు తనకు ఏమీ ఆస్తిపాస్తులు లేవని పిల్లనివ్వలేదు. ఈ సందర్భంలో అదే సామాజికవర్గానికి చెందిన పద్మారావు గౌడ్, పొచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, శ్రవన్ పెద్ద మనసుతో అమ్మాయి తల్లిదండ్రులను ఒప్పించి ఖచ్చితంగా భవిష్యత్తులో ఎమ్మెల్యే అవుతాడని కేసీఆర్ కు దగ్గర అని నా పెళ్లిని అందరినీ ఒప్పించి చేయించారు. నా పెళ్లి అయ్యిందంటే మీరే కారణం.. మీకు ధన్యవాదాలు అంటూ ’ తన ప్రేమకథను.. అందులో పద్మారావు గౌడ్ పాత్రను అసెంబ్లీలో ప్రస్తావించి నవ్వులు పూయించాడు బాల్కసుమన్. సుమన్ ప్రసంగిస్తున్నంత సేపు పద్మారావు గౌడ్ నవ్వుతూనే ఉండడం విశేషం.
ముఖ్యంగా పెళ్లి చేయడంతోపాటు ఉద్యమ సమయంలో జైళ్లలో పడ్డప్పడు, కేసుల పాలైనప్పుడు పద్మారావు తనను ఆదుకున్నాడని సుమన్ గుర్తు చేసుకున్నారు. మీరు డిప్యూటీ స్పీకర్ కావడం తనకు చాలా సంతోషంగా ఉందని ముగించాడు.