Begin typing your search above and press return to search.
పాక్ స్టాక్ ఎక్స్చేంజి పై ఉగ్రదాడి ..5 మంది మృతి !
By: Tupaki Desk | 29 Jun 2020 2:30 PM GMTపాకిస్తాన్ లోని కరాచీలో ఉగ్రవాదులు స్టాక్ ఎక్స్చేంజి పై దాడులు చేశారు. ఈ ఉదయం స్టాక్ ఎక్స్చేంజి భవనంలోకి ప్రవేశించిన నలుగురు ఉగ్రవాదులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఐదుగురు మరణించారు. మరణించిన 5 మందిలో ఒక పోలీస్ ఎస్ ఐ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. సమాచారం అందుకున్న భద్రతా బలగాలు స్టాక్ ఎక్స్చేంజి వద్దకు చేరుకొని స్టాక్ ఎక్స్చేంజిలో చిక్కుకున్న సిబ్బందిని ఖాళీ చేయించారు.
అనంతరం భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎదురు కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు మృతి చెందినట్టు భద్రతా బలగాలు తెలిపాయి. కారులో వచ్చిన ఉగ్రవాదులు స్టాక్ ఎక్స్చేంజి భవనం దగ్గరకు రాగానే గ్రనేడ్ తో దాడులు చేసారని, తరువాత లోనికి ప్రవేశించి విచక్షణా రహితంగా కాల్పులు జరిపినట్టు ఎక్స్చేంజి అధికారులు తెలిపారు.
ఈ దాడి చేపట్టింది తామేనని బలూచ్ లిబరేషన్ ఆర్మీ మిలిటెంట్లు ప్రకటించారు. తమకు ప్రత్యేక దేశం కావాలని ఇక్కడి బలూచ్ గ్రూప్ లు ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్నాయి. బలూచిస్తాన్ ప్రావిన్స్ వనరుల్లో మరింత ఎక్కువగా తమ వాటా దక్కాలని వారు డిమాండ్ చేస్తున్నారు.ఆటోమేటిక్ రైఫిళ్లతో వచ్చిన మిలిటెంట్లు స్టాక్ ఎక్స్‌చేంజ్ వెలుపలి భద్రతా చెక్‌పోస్ట్‌పై గ్రెనేడ్ విసరడంతో తాజా దాడి మొదలైంది. గ్రెనేడ్ విసిరిన అనంతరం మిలిటెంట్లు కాల్పులు జరిపారు.