Begin typing your search above and press return to search.
ఓయూలో హీట్ పెంచుతున్న రేవంత్ రెడ్డి
By: Tupaki Desk | 1 Jun 2016 1:07 PM GMTతెలంగాణ తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీలో హీట్ పెంచుతున్నారు. తెలంగాణ ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ 32 విద్యార్థి సంఘాలు నిర్వహిస్తున్న జన జాతర సభకి రేవంత్ హాజరుకానున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఓయూలో రేవంత్ అనుకూల-వ్యతిరేక వర్గాలుగా విద్యార్థులు చీలిపోయారు. ఈ ఎపిసోడ్ ఇపుడు మానవ హక్కుల సంఘం వద్దకు చేరింది.
శాంతిభద్రతలకి విఘాతం కలిగే అవకాశాలున్నందువల్ల రేవంత్ రెడ్డిని సభకు రాకుండా అడ్డుకునేలా పోలీసులకి ఆదేశాలు జారీ చేయాలంటూ విద్యార్థి జేఏసీ చైర్మెన్ దూదిమెట్ల బాలరాజ్ హెచ్చార్సీని ఆశ్రయించి పిటీషన్ దాఖలు చేశారు. యూనివర్సిటీలో వాతావరణాన్ని దెబ్బతీసేలా రేవంత్ ప్రసంగం ఉండనున్నట్లు ఆయన అభిప్రాయపడ్డారు. అయితే దీనిపై హెచ్ ఆర్‌సీ రేపు విచారణ చేపట్టనుంది.
విద్యార్థులు నిర్వహించనున్న ఈ సభకు ఒక్క అధికార టీఆర్ ఎస్ పార్టీ తప్ప మిగతా పార్టీలకు చెందని కీలక నేతలంతా హాజరుకానున్నారు. రెండేళ్ల టీఆర్ ఎస్ పాలనలో విద్యార్థులకు, తెలంగాణ సమాజానికి టీఆర్ ఎస్ సర్కారు ఎలాంటి న్యాయం చేయలేదని పేర్కొంటూ విద్యార్థులు ఈ సభకు శ్రీకారం చుట్టారు.