Begin typing your search above and press return to search.

రాజకీయ పార్టీలకు ఈసీ ఝులక్..

By:  Tupaki Desk   |   19 Dec 2016 7:33 AM GMT
రాజకీయ పార్టీలకు ఈసీ ఝులక్..
X
దేశంలో నల్లధనం పెరగడానికి గల మిగిలిన కారణాలకంటే రాజకీయ పరమైన కారణాలే ఎక్కువనేది ఎక్కువమంది చెప్పే విషయం. అయితే రాజకీయ అవినీతిపై కూడా రోజు రోజుకీ రకరకాల విమర్శలు వస్తోన్న సంగతి తెలిసిందే. అయితే అన్నింటికీ ప్రధానకారణమైన రాజకీయ అవినీతిపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఈ క్రమంలో దేశంలోని అన్ని రాజకీయ పార్టీలపైనా ఎన్నికల కమిషన్ పట్టు బిగిస్తోంది. ముఖ్యంగా ఎన్నికల సమయంలో బ్లాక్ మనీతో చెలరేగిపోయే పార్టీలకు కళ్ళెం వేయాలని నిర్ణయించిన ఈసీ.. తన తాజా ప్రతిపాదనలను కేంద్రం ముందుంచింది. వాటిలో ప్రధానమైంది అజ్ఞాతంగా వచ్చే విరాళాలపై నిషేధం విధించడం!

ఈ క్రమంలో ప్రతి రాజకీయ పార్టీ తమకు వచ్చే డొనేషన్లలో రూ.2 వేలు అంతకు మించిన డోనేషన్లకు కచ్చితంగా లెక్క చెప్పాలని ఎన్నికల కమిషన్ సూచించింది. గతంలో పార్టీలకు వచ్చే 20 వేల లోపు రహస్య విరాళాలకు మినహాయింపు ఉండేది. ఇదే సమయంలో ఇలాంటి విరాళాలపై రాజ్యాంగ పరంగాగానీ, చట్ట పరంగాగానీ నిషేధం ఏమీ లేదు. కానీ ఇకనుంచి రెండు వేలు, అంతకు మించి వచ్చే విరాళాలకు తప్పనిసరిగా లెక్క చెప్పాలని, దీనికి అనువుగా ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని సవరించాలని కేంద్రాన్ని కోరింది ఈసీ. దీంతో అటు పార్లమెంటు, ఇటు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన పార్టీలకు పన్ను మినహాయింపు ఇవ్వాలని కూడా ఈసీ సూచించిన క్రమంలో 2019లో జరిగే ఎన్నికలు ఎలా ఉండబోతాయో వేచి చూడాలి. ఇదే జరిగితే.. ఓటుకు నోటు లు చాలా వరకూ తగ్గే అవకాశం ఉందనే పలువురు అభిప్రాయపడుతున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/