Begin typing your search above and press return to search.

సాధువుల్ని లాఠీలతో అలా కుళ్లబొడుస్తారా?

By:  Tupaki Desk   |   23 Sep 2015 9:37 AM GMT
సాధువుల్ని లాఠీలతో అలా కుళ్లబొడుస్తారా?
X
దేశ ప్రధాని మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి నియోజకవర్గంలో చోటు చేసుకున్న తాజా ఉదంతం కలకలం రేపుతోంది. సాధువులు అన్నది కూడా చూడకుండా పోలీసులు లాఠీలకు పని చెప్పిన తీరు.. వారిని కుళ్లబొడిచిన తీరు వారణాసిలో కొత్త ఉద్రిక్తతలకు దారి తీస్తోంది.

వినాయకచవితి సందర్భంగా పూజలు జరిపిన వినాయక ప్రతిమలను గంగా నదిలో నిమజ్జనం చేసేందుకు కొందరు స్థానికులు.. వారికి తోడుగా మరికొందరు సాధువులు కలిసి బయలుదేరారు. అయితే.. గంగానది కాలుష్య నివారణలో భాగంగా గంగలో ఎలాంటి వినాయక ప్రతిమల్ని నిమజ్జనం చేయకూడదని కోర్టు పేర్కొంది. కోర్టు ఆదేశాల్ని పెద్దగా పట్టించుకోని సాధువులు.. స్థానికులు తమ దారిన తాము నిమజ్జనం చేసేందుకు బయలుదేరారు.

వారిని అడ్డుకున్న పోలీసులు నిమజ్జనం కుదరదని చెప్పారు. అయితే.. అందుకు షాధువులు.. స్థానికులు ఒప్పుకోలేదు. దీంతో వ్యవహారం ముదిరిపోయింది. సాధువులపై పోలీసులు లాఠీ విరిగాయి. విచక్షణారహితంగా వారిని కుళ్లబొడవటంతో.. ఒకదశలో సాధువులు పరుగులు పెట్టిన పరిస్థితి. ఇది స్థానికంగా తీవ్ర కలకలాన్ని రేపింది. వినాయక నిమజ్జన విషయంలో ఇంత దారుణంగా వ్యవహరిస్తారా? అని ప్రశ్నిస్తున్నారు. సాధువులపై విరిగిన లాఠీ ఉదంతంపై పలువురు తీవ్రంగా ఖండిస్తున్నారు.