Begin typing your search above and press return to search.

ఏపీలో అక్ర‌మ లేఅవుట్ల‌పై నిషేధం.. సొంత నేత‌ల‌కు చెక్‌!!

By:  Tupaki Desk   |   19 Feb 2022 2:30 PM GMT
ఏపీలో అక్ర‌మ లేఅవుట్ల‌పై నిషేధం.. సొంత నేత‌ల‌కు చెక్‌!!
X
ఏపీలో అక్ర‌మ లే అవుట్ల రిజిస్ట్రేష‌న్‌ల‌పై.. రాష్ట్ర ప్ర‌భుత్వం నిషేధం విధించింది. ఇటీవ‌ల కాలంలో ఆన్‌లై న్‌లో రిజిస్ట్రేష‌న్ల ప్ర‌క్రియ అందుబాటులోకి తీసుకువ‌చ్చారు.

అయితే... ఈ క్ర‌మంలో అనేక చోట్ల అక్ర‌మాలు వెలుగు చూశాయి. ముఖ్యంగా కృష్ణాజిల్లాలోని నూజివీడు, విజ‌య‌న‌గ‌రం జిల్లాలోని బొబ్బిలి, విజ‌య‌న‌గ‌రం శివారు ప్రాంతాల్లో అక్ర‌మ రిజ‌స్ట్రేష‌న్లు జ‌రిగాయి. ముఖ్యంగా.. కృష్ణాజిల్లా నూజివీడులో అయ‌తే.. అట‌వీ ప్రాంతాన్ని కూడా కొంద‌రు అధికార పార్టీకి చెందిన వారు అక్ర‌మంగా రిజిస్ట్రేష‌న్ చేయించుకున్నారు.

ఈ ప్రాంతంలో బొగ్గుగ‌నులు ఉన్నాయ‌ని...కేంద్రం గుర్తించింది. దీంతో ఇక్క‌డ మైనింగ్ చేప‌ట్ట‌నున్న‌ట్టు ఇటీవ‌ల ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. దీంతో రంగంలోకి దిగిన‌.. అధికార పార్టీ నాయ‌కులు... కొంద‌రు.. అట‌వీ ప్రాంతంలోని భూముల‌తో పాటు.. కొన్ని అన్ రిజిస్ట‌ర్డ్ భూములను కూడా త‌మ పేరిట ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేష న్ చేయించుకున్నారు. దీనికి కొంద‌రు రెవెన్యూ అధికారులు కూడా స‌హ‌క‌రించార‌నే వాద‌న ఉంది. ఈ క్ర‌మంలో ప‌త్రిక‌ల్లో ఈ వార్త‌లు పెద్ద ఎత్తున వ‌చ్చాయి. ఈ నేప‌థ్యంలో ఇలాంటి వాటిపై గుట్టు చ‌ప్పుడు కాకుండా.. చెక్ పెట్టేందుకు ప్ర‌భుత్వం సిద్ధ‌మైంది.

అదేస‌మ‌యంలో మంత్రి బొత్స కుటుంబం స‌భ్యుల‌కు సంబంధించి కూడా ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. బొబ్బిలి, విజ‌య‌న‌గ‌రం శివారు ప్రాంతాల్లో బొత్స కుటుంబ స‌భ్యులు కొన్ని బూముల‌ను ఆన్‌లైన్ రిజిస్ట్రేష‌న్ చేయించుకున్న‌ట్టు పెద్ద ఎత్తున ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. ఈ ఒక్క రెండు జిల్లాల్లోనే కాకుండా.. రాష్ట్ర వ్యాప్తంగా ప‌లు జిల్లాల్లో అధికార పార్టీ నేత‌ల ఆగ‌డాలు పెరుగుతున్నాయి.

ఈ నేప‌థ్యంలో నేరుగా నాయ‌కుల‌ను హెచ్చ‌రించ‌లేక‌పోయిన ప్ర‌భుత్వం.. ఇప్పుడు.. అధికారికంగా చెక్ పెట్టేలా నిర్ణ‌యం తీసుకుంది.

డీటీసీపీ అనుమ‌తి లేని లే అవుట్‌ల‌లో ప్లాట్లు రిజిస్ట్రేష‌న్ చేయొద్ద‌ని. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేష‌న్ శాఖ డీఐజీ, జిల్లా రిజిస్ట్రార్ల‌ను కూడా ప్ర‌భుత్వం ఆదేశించింది. అంతేకాదు.. ఈ ఆదేశాలు ఉల్లంఘిస్తే.. తీవ్ర చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని ప్ర‌భుత్వం హెచ్చ‌రించింది.