Begin typing your search above and press return to search.

యోగి దెబ్బ‌కు సింహాల‌కు క‌ష్ట‌కాలం

By:  Tupaki Desk   |   26 March 2017 6:41 AM GMT
యోగి దెబ్బ‌కు సింహాల‌కు క‌ష్ట‌కాలం
X
ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌ లో సింహాల‌కు క‌ష్ట‌కాలం వ‌చ్చింది. ఎందుకో తెలుసా? ఉత్త‌ర‌ప్ర‌దేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఎఫెక్ట్! అదెలానో తెలుసా? సీఎం ఆదిత్య‌నాథ్ ఆదేశాల‌కు మేరకు క‌బేళాలు మూత‌ప‌డుతున్నాయి. దీంతో ఇటావా స‌ఫారీ పార్క్‌లో ఉన్న సింహాల‌కు బీఫ్ దొర‌క‌డం క‌ష్టంగా మారింది. దీంతో జూలోని సింహాలకు తీవ్ర క‌ట‌క‌ట ఎదుర‌వ‌తున్న‌ది. అయితే ప్ర‌స్తుతానికి ఫారెస్ట్ ఆఫీస‌ర్లు ప్ర‌త్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. అక్ర‌మ క‌బేళాల‌ను మూసివేయ‌డంతో స‌ఫారీ పార్క్‌ లో ఉన్న సింహాల‌కు మేక మాంసాన్ని అందిస్తున్న‌ట్లు ఫారెస్ట్ ఆఫీస‌ర్ జేలాల్ తెలిపారు. అవ‌స‌ర‌మైతే సింహాల‌కు బ‌య‌ట రాష్ట్రం నుంచి అయినా మాంసం తెప్పిస్తామంటున్నారు.

మ‌రోవైపు సీఎం యోగి ఆదేశాల మేరకు ఇప్ప‌టికే రాష్ట్రంలో దాదాపు మూడు వంద‌ల‌కు పైగా అక్ర‌మ క‌బేళాల‌ను మూసివేశారు. అక్రమ కబేళాలలను మూసివేయాలని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ జారీ చేసిన ఆదేశాలతో లక్నోలో వందేళ్లుగా కొనసాగుతున్న ప్రఖ్యాత టుండే కబాబీ సెంటర్ తొలిసారిగా కస్టమర్లు లేక వెలవెలబోయింది. ఎద్దుమాంసంతో చేసిన కబాబ్‌లను విక్రయించే ఈ దుకాణం కేవలం యూపీలోనే కాదు... అంతర్జాతీయంగానూ ప్రసిద్ధి పొందింది. లక్నోలో అత్యంత పురాతన కబాబ్ కేంద్రమైన టుండే కబాబీ దుకాణం ఏ రోజు చూసినా కస్టమర్లతో కిటకిటలాడుతూ ఉండేది. అలాంటిది, గురువారం కస్టమర్లు లేక వెలవెలబోయింది. దీనికి కారణం... ఈ దుకాణానికి ప్రతిరోజూ 25 కిలోల ఎద్దుమాంసాన్ని సరఫరా చేసే కబేళాను పత్రాలు సరైనవిధంగా లేవన్న కారణంతో అధికారులు మూసివేశారు. దీంతో మరో ప్రత్యామ్నాయం లేక... టుండే కబాబీ సెంటర్‌లో చికెన్, మటన్ కబాబ్‌లను మాత్రమే తయారుచేశారు. వాటిని తినటానికి కస్టమర్లు అంతగా ఆసక్తి చూపకపోవటంతో దుకాణంలోని కుర్చీలు ఖాళీగా కనిపించాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/