Begin typing your search above and press return to search.
కాంగ్రెస్ తో టీడీపీనా.? ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తోంది
By: Tupaki Desk | 27 Oct 2018 6:21 AM GMTకేంద్ర మాజీ మంత్రి - బీజేపీ నేత బండారు దత్తాత్రేయ టీడీపీ వైఖరిపై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పురుడు పోసుకున్న టీడీపీ.. ఇప్పుడు అదే పార్టీతో పొత్తు పెట్టుకోవడం దౌర్భాగ్యమని.. దీనికి ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుందని దత్తాత్రేయ ఆవేదన వ్యక్తం చేశారు. సూర్యపేట లో విలేకరులతో మాట్లాడిన ఆయన చంద్రబాబు తీరును ఎండగట్టారు. కాంగ్రెస్ పై ఏళ్లుగా పోరాటం చేసి.. ఆకస్మాత్తుగా ఆ పార్టీతో ఎందుకు పొత్తు పెట్టుకోవాల్సి వచ్చిందో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
చంద్రబాబు.. బద్ద శత్రువైన కాంగ్రెస్ తో కలిసి టీడీపీ అస్తిత్వాన్ని కోల్పేయాలే చేశాడని దత్తాత్రేయ విమర్శించారు. ఏపీలో ఐటీ దాడులకు బాబు ఉలికిపడుతున్నాడని.. ఆ కంపెనీలతో బాబుకు ఏమైనా లోపాయికారి లావాదేవీలేమైనా ఉన్నాయా అని ప్రశ్నించారు. ప్రధాని మోడీని విమర్శించే నైతిక హక్కు బాబుకు లేదని అన్నారు.
మహాకూటమి మాయకూటమిగా మారిందని.. కోదండరాం సిద్ధాంతాలను పక్కనపెట్టి కాంగ్రెస్ దాసోహామై టికెట్ల కోసం వెంపర్లాడుతున్నాడని దత్తాత్రేయ విమర్శించారు. రానున్న ఎన్నికల్లో కాషాయ జెండా రెపరెపలాడుతోందని.. టీఆర్ఎస్ ఓడిపోవడం ఖాయమని స్పష్టం చేశారు.