Begin typing your search above and press return to search.
కేసీఆర్ జీ... దత్తన్న మాటలు విన్నారా?
By: Tupaki Desk | 29 Oct 2016 10:27 AM GMTతెలంగాణలో అధికార పార్టీ టీఆర్ ఎస్ - కేంద్రంలో అధికార పార్టీ బీజేపీల మధ్య సంబంధాలు అంత మంచిగా ఏమీ లేవు. తెలంగాణలో బీజేపీ... టీఆర్ ఎస్ కు వైరివర్గంగానే కొనసాగుతోంది. ఈ క్రమంలో ఇరు పార్టీల మధ్య తరచూ మాటల తూటాలు పేలుతున్నాయి. ఇరు పార్టీల నేతలు ఒకరిపై మరొకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. అయితే ఈ వాగ్వాదాలకు - విమర్శలు - ప్రతి విమర్శలకు బీజేపీ సీనియర్ నేత, కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ మాత్రం మినహాయింపు. టీఆర్ ఎస్ ను కాని - ఆ పార్టీ అధినేత - సీఎం కేసీఆర్ ను కాని దత్తన్న సింగిల్ మాట కూడా అనరు. అలాగే బీజేపీలోని అందరు నేతలను ఇష్టమొచ్చినట్లు దునుమాడే టీఆర్ ఎస్ నేతలు కూడా దత్తన్నను పల్లెత్తు మాట కూడా అనరు. అంతేకాదండోయ్... దత్తన్న తమకు పెద్దన్న కిందే లెక్క అంటూ ఆయనపై ప్రశంసలు కురిపిస్తారు.
దేశ రాజధాని ఢిల్లీలో తమకు దత్తన్నే పెద్ద దిక్కు అంటూ ఇటీవలే సాక్షాత్తు కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఇక అదే రీతిలో సికింద్రాబాదు ఎంపీగా ఉన్న దత్తన్న తన ఇలాకాలో ఏ కార్యక్రమం చేపట్టినా... కేసీఆర్ ను పిలవకుండా ఉండరు. ఈ క్రమంలో సరికొత్తగా దత్తన్న నోట నుంచి కేసీఆర్ వైఖరి - తెలంగాణ ప్రభుత్వ వైఖరిని ప్రశ్నిస్తూ పలు వ్యాఖ్యలు వెలువడ్డాయి. సుతిమెత్తగా - నొప్పించక - తానొవ్వక అన్న రీతిలో సాగిన దత్తన్న వ్యాఖ్యలపై కేసీఆర్ ఎలా స్పందిస్తారోనన్న ఆసక్తి నెలకొంది. ప్రస్తుతమున్న సచివాలయాన్ని కూల్చివేసి దాని స్థానంలో కొత్త సెక్రటేరియట్ ను కట్టాలని కేసీఆర్ దాదాపుగా నిర్ణయించిన సంగతి తెలిసిందే. కేవలం వాస్తుదోషం ఉందన్న సింగిల్ కారణంతోనే కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారని విపక్షాలన్నీ గగ్గోలు పెడుతున్నాయి. ఇదే అంశాన్ని ప్రాతిపదికగా తీసుకున్న దత్తన్న... కేసీఆర్ వైఖరిని తప్పుబట్టారు. సచివాలయాన్ని కూలగొట్టి కొత్తగా కట్టించాలన్న కేసీఆర్ నిర్ణయాన్ని చూస్తే... ఆయనలో దాగి ఉన్న ఆలోచనలు ఎలాంటివో ఇప్పుడిప్పుడే తెలుస్తోందని దత్తన్న అన్నారు. ప్రజాధనం దుర్వినియోగం అవుతున్న విషయాన్ని టీఆర్ ఎస్ ప్రభుత్వం గుర్తించాల్సి ఉందన్నారు. అంతేకాకుండా రాష్ట్రంలో ప్రజలు - ఉద్యోగులు - వివిధ వర్గాల వారికి ఎదురవుతున్న సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం ముందుగా దృష్టి సారించాలని దత్తన్న వ్యాఖ్యానించారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/