Begin typing your search above and press return to search.
దత్తన్న పదవి త్యాగం చేశారా..ఊడబీకేశారా?
By: Tupaki Desk | 1 Sep 2017 6:15 PM GMTకేంద్ర కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ సెగ తెలుగు రాష్ర్టానికి సైతం తాకింది. తెలంగాణలో బీజేపీకి ఏకైక పెద్ద దిక్కుగా ఉన్న బండారు దత్తాత్రేయకు సైతం తాజా ఎపిసోడ్ లో పదవి వీడాల్సిన పరిస్థితి. కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో భాగంగా పలువురు కేంద్రమంత్రులు తమ పదవులకు రాజీనామా చేసిన, చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఏడుగురు మంత్రులు తమ పదవులకు రాజీనామా చేశారు. తాజాగా బండారు దత్తాత్రేయ కూడా కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేశారు. పార్టీ అవసరాల కోసం పని చేస్తానని అధిష్టానానికి దత్తాత్రేయ వెల్లడించారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేంద్ర కేబినెట్ పునర్ వ్యవస్థీకరణకు ముహూర్తం ఖరారు చేశారు. ఈ నెల 3న (ఆదివారం) ఉదయం పది గంటలకు కొత్త మంత్రులు ప్రమాణం చేయనున్నారు. రాజీనామా చేసిన వారిలో ఉమా భారతి - రాజీవ్ ప్రతాప్ రూఢీ - సంజీవ్ బలియాన్ - రాధామోహన్ సింగ్ - ఫగన్ సింగ్ కులస్తే - కల్ రాజ్ మిశ్రా - బండారు దత్తాత్రేయ - మహేంద్ర పాండే ఉన్నారు. 2014లో అధికారంలోకి వచ్చిన ఎన్డీయే ప్రభుత్వం మూడోసారి కేబినెట్ విస్తరణ చేస్తోంది. ఇప్పటికే బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాతో మాట్లాడి ప్రధానమంత్రి మోడీ దీనికి తుదిరూపు కూడా ఇచ్చారు. ఈసారి కొత్త ముఖాలకు చాన్స్ ఇవ్వాలని మోడీ భావిస్తున్నారని సమాచారం. అందులో భాగంగా ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు జేడీయూ, ఏఐఏడీఎంకేలకు కూడా మంత్రివర్గంలో స్థానం కల్పించే అవకాశం ఉంది.
అయితే గతంలోనే దత్తాత్రేయను కేంద్ర మంత్రి పదవి నుంచి తొలగించనున్నారని వార్తలు వచ్చాయి. అయితే పలు కారణాల వల్ల ఆ నిర్ణయం వెనక్కుపోయింది. ఈ నేపథ్యంలో గత సమీకరణాల కారణంగానే పదవి పోయిందా లేదా పార్టీ బలోపేత సమీకరణంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారా అనే చర్చ జరుగుతోంది.