Begin typing your search above and press return to search.

మిత్రుడ్ని ఏసుకున్న ద‌త్త‌న్న‌

By:  Tupaki Desk   |   24 Dec 2017 5:32 AM GMT
మిత్రుడ్ని ఏసుకున్న ద‌త్త‌న్న‌
X
ప‌ద‌విలో ఉన్న‌ప్పుడు ల‌భించే మ‌ర్యాద‌.. మ‌న్న‌న అది చేజారిన త‌ర్వాతే దాని విలువ తెలుస్తుంది. పవ‌ర్ లో ఉన్న‌ప్పుడు మిత్రుడ‌న్న మాట‌లు.. నెత్తిన పెట్టుకున్న‌ట్లుగా చూసుకునే తీరు వాస్త‌వాన్ని గుర్తించ‌లేని తీరులో త‌యారు చేస్తుంది. ఇదే త‌ర్వాతి కాలంలో ఇబ్బందిగా మారుతుంది. అప్ప‌టివ‌ర‌కూ ఎంతో ప్రాధాన్య‌త ఇచ్చినోళ్లే.. ప‌ద‌వి పోయిన త‌ర్వాత ప‌క్క‌కు పెడితే క‌లిగే బాధ ఎంత‌న్న‌ది మాజీ కేంద్ర‌మంత్రి ద‌త్త‌న్న‌కు తెలిసినంత బాగా మ‌రెవ‌రికీ తెలీదు.

కేంద్ర‌మంత్రిగా వ్య‌వ‌హ‌రిస్తున్న వేళ‌.. వీకెండ్ వ‌స్తే చాలు.. ద‌త్త‌న్న డైరీ అస్స‌లు ఖాళీ ఉండేది కాదు. ఆయ‌న అటూ.. ఇటూ తిరుగుతూనే ఉండేవారు. ఇక‌.. సీఎం కేసీఆర్ ఏదైనా కార్య‌క్ర‌మానికి పాల్గొంటున్నారంటే ద‌త్త‌న్న త‌ప్ప‌నిస‌రి అన్న‌ట్లు ఉండేది.

ఇక‌.. ఢిల్లీకి వెళ్లే కేసీఆర్‌.. త‌న ఎంపీల‌ను ఉద్దేశించి ద‌త్త‌న్న ద‌గ్గ‌ర చెప్పిన మాట‌లు అన్ని ఇన్ని కావు. తెలంగాణ వ‌ర‌కూ ద‌త్త‌న్నే ఢిల్లీ.. ఢిల్లీనే ద‌త్త‌న్న అన్న‌ట్లుగా ఉండేది. ఎప్పుడైతే ప‌ద‌వి పోయిందో.. ఆయ‌న‌కు తత్త్వం బోధ ప‌డింది. అప్ప‌టివ‌ర‌కూ భుజాన ఎక్కించుకున్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ సైతం ద‌త్త‌న్న‌ను లైట్ తీసుకోవ‌టం మొద‌లెట్టారు.

కేంద్ర‌మంత్రి ప‌ద‌విలో ఉన్న‌ప్పుడు ఇచ్చిన విలువ‌కు.. త‌ర్వాతి కాలంలో ఆయ‌న‌కు ఇస్తున్న ప్రాధాన్య‌త ఏమిటో తెలిసేకొద్దీ.. ద‌త్త‌న్న‌లో సాఫ్ట్ క్యారెక్ట‌ర్ పోయి.. అస‌లుసిస‌లు నాయ‌కుడు నిద్ర లేస్తున్నాడు. మంత్రిగా ఉన్న వేళ త‌న‌కు ద‌క్కిన మ‌ర్యాద‌.. గౌర‌వాల నేప‌థ్యంలో తెలంగాణ అధికార‌ప‌క్షాన్ని త‌ప్పు ప‌ట్టాలంటే సంకోచించే ద‌త్త‌న్న ఇప్పుడు అందుకు భిన్నంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. కేసీఆర్ స‌ర్కారుపై విమ‌ర్శ‌లు సంధించేందుకు అస్స‌లు వెనుకాడ‌టం లేదు.

ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్వ‌హించాల్సిన జాతీయ సైన్స్ కాంగ్రెస్ స‌ద‌స్సును తెలంగాణ రాష్ట్ర స‌ర్కారు వాయిదా వేయించ‌టం ద్వారా.. త‌న అస‌మ‌ర్థ‌త‌ను.. చేత‌కానిత‌నాన్ని బ‌య‌ట‌పెట్టుకుంద‌ని ద‌త్త‌న్న ఫైర్ అవుతున్నారు. ఎవ‌రో విద్యార్థులు నిర‌స‌న తెలుపుతారంటూ స్టూడెంట్స్ మీద నింద‌లు వేయ‌టం ఏ మాత్రం స‌రికాద‌ని ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

విద్యార్థుల‌పై నింద‌లు వేస్తూ.. శాంతిభ‌ద్ర‌త‌ల బూచిని చూపిస్తూ.. సైన్స్ కాంగ్రెస్ స‌ద‌స్సును నిర్వ‌హించ‌కుండా ప్ర‌భుత్వం త‌ప్పించుకోవ‌టం స‌రికాద‌న్నారు. తన‌ను తాను ఉద్య‌మ‌కారుడ‌ని చెప్పుకునే కేసీఆర్‌.. ఓయూ అంటే ఎందుకు పారిపోతున్నారంటూ సూటిగా ప్ర‌శ్నించారు. ఇలంటి చురుకు పుట్టే ప్ర‌శ్న‌ల‌న్నీ కేంద్ర‌మంత్రిగా ఉన్న వేళ మీ నోటి నుంచి రాలేదేం ద‌త్త‌న్న‌..? ఒక‌ప్పుడు త‌న‌కెంతో క్లోజ్ అయిన మిత్రుడ్ని ఉద్దేశిస్తూ వేస్తున్న ప్ర‌శ్న‌లకు గులాబీ నేత‌లు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.