Begin typing your search above and press return to search.
బీజేపీని కెలికి చిక్కుల్లో పడ్డ కేటీఆర్
By: Tupaki Desk | 17 Jun 2016 8:23 AM GMTబీజేపీ - టీఆర్ ఎస్ మధ్య కోల్డ్ వార్ కంటిన్యూ అవుతోంది. నల్లగొండ జిల్లా సూర్యాపేట సభలో బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా రాష్ట్ర సర్కార్ పై చేసిన కామెంట్స్ రెండు పార్టీల మధ్య గ్యాప్ ను మరింత పెంచాయి. కేంద్ర నిధులతోనే రాష్ట్ర అభివృద్థి అంటూ అమిత్ షా చేసిన వ్యాఖ్యలను గులాబీ నేతలు తప్పుబట్టిన ఎపిసోడ్ మరిచిపోకముందే మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు రెండు పార్టీల నేతల వివాదానికి బీజంగా మారాయి.
ఐటీ పరిశ్రమ అభివృద్ధికి ఉద్దేశించిన ITIR ప్రాజెక్టు విషయంలో కేంద్రం నిర్లక్ష్యం వహిస్తుందని మంత్రి కేటీఆర్ చేసిన ఆరోపణలపై కేంద్ర మంత్రి దత్తాత్రేయ ఘాటుగా స్పందించారు. ITIR ప్రాజెక్టుపై వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడుతున్నారని దత్తాత్రేయ పేర్కొంటూ ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి DPR ఇవ్వలేదని చెప్పారు. కేంద్రం చేస్తున్న అభివృద్ధిని రాష్ట్ర ప్రభుత్వం తక్కువగా చూపిస్తుందని దత్తాత్రేయ ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం తనకు కావాల్సిన అభివృద్ది పనులకు సంబంధించిన డీపీఆర్ లు కేంద్రానికి ఇవ్వకపోవడంతోనే చాలా ప్రాజెక్టులు ఆగిపోతున్నాయని చెప్పారు. ప్రతీ విషయాన్ని కేంద్ర ప్రభుత్వంపై నెట్టడం సరికాదని అసహనం వ్యక్తం చేశారు.
మరోవైపు హైకోర్టు విభజన అంశంపై కూడా రెండు పార్టీల మధ్య వార్ కొనసాగుతూనే ఉంది. కేవలం చంద్రబాబుకు భయపడి కేంద్ర సర్కార్ హైకోర్టును విభజించడంలేదని గులాబీ నేతలు ఆరోపిస్తున్నారు. దీనికి కూడా కమలం నేతలు కౌంటర్లు ఇస్తున్నారు. ఒక రాజధానిలో రెండు హైకోర్టులు ఉండకూడదని ఇదే అంశం రాష్ట్ర పునర్విభజన చట్టంలోనూ ఉందని గుర్తు చేస్తున్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా టీఆర్ ఎస్ నేతలు మాట్లాడుతున్నారని బీజేపీ నాయకులు విమర్శిస్తోంది. మొత్తంగా కొద్దికాలం క్రితం వరకు పెద్దగా విమర్శలేమీ లేని ఈ రెండు పార్టీల మధ్య నిధుల సమస్య నిప్పును రాజేసిందని విశ్లేషిస్తున్నారు.