Begin typing your search above and press return to search.

స్మృతికి ద‌త్తాత్రేయ రాసిన లేఖ ఇదే!

By:  Tupaki Desk   |   18 Jan 2016 1:02 PM GMT
స్మృతికి ద‌త్తాత్రేయ రాసిన లేఖ ఇదే!
X
హైద‌రాబాద్ సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీలో చోటు చేసుకున్న ప‌రిణామాలు ఇప్పుడు తెలంగాణ నుంచి ఢిల్లీ వ‌ర‌కూ చేరాయి. సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీకి చెందిన ఒక పీహెచ్‌డీ విద్యార్థి రోహిత్‌ ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌టం..అందుకు కేంద్ర‌మంత్రి బండారు ద‌త్తాత్రేయ రాసిన లేఖే కార‌ణంగా ఆరోపిస్తున్న సంగ‌తి తెలిసిందే. కేంద్ర మాన‌వ వ‌న‌రుల శాఖ మంత్రి స్మృతి ఇరానీకి ద‌త్తాత్రేయ రాసిన లేఖ‌.. అందులోని అంశాలు ఇప్పుడు బ‌యట‌కు వ‌చ్చాయి. తాజాగా వ‌చ్చిన ఆ లేఖ‌ను చూస్తే..

హెచ్‌సీయూలోని అంబేడ్క‌ర్ స్టూడెంట్స్ అసోసియేష‌న్ స‌భ్యుల కార్య‌క‌లాపాల గురించి.. యాకూబ్ మెమ‌న్ ఉరి సంద‌ర్భంగా.. ఉరికి వ్య‌తిరేకంగా ప్ర‌ద‌ర్శ‌న నిర్వ‌హించ‌టం.. దీన్ని వ్య‌తిరేకించిన ఏబీవీపీ నేత‌పై దాడి చేసిన విష‌యాన్ని ప్ర‌స్తావిస్తూ.. స‌ద‌రు సంస్థ జాతి వ్య‌తిరేక చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతుంద‌ని ద‌త్తాత్రేయ లేఖ రాయ‌టం గ‌మ‌నార్హం. ఏబీవీపీ నేత‌పై చేసిన దాడికి పాల్ప‌డిన వారిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని.. తాను సికింద్రాబాద్ నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్నాన‌ని.. త‌న‌కు హైద‌రాబాద్‌కు సంబంధించిన అంశాల మీద అవ‌గాహ‌న ఉంద‌ని ద‌త్తాత్రేయ స‌ద‌రు లేఖ‌లో పేర్కొన్నారు.

మ‌రోవైపు త‌న మీద వెల్ల‌వెత్తుతున్న ఆరోప‌ణ‌ల‌పై బండారు ద‌త్తాత్రేయ స్పందించారు. త‌న లేఖ‌కు.. రోహిత్ ఆత్మ‌హ‌త్యకు ఎలాంటి సంబంధం లేద‌ని స్ప‌ష్టం చేశారు. యూనివ‌ర్సిటీలో చోటు చేసుకుంటున్న ప‌రిస్థితుల‌పై త‌న‌కు అందిన విన‌తిప‌త్రం ఆధారంగా తాను చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరానే త‌ప్పించి.. త‌న‌కు.. పార్టీకి ఏ మాత్రం సంబంధం లేద‌ని వ్యాఖ్యానించారు.