Begin typing your search above and press return to search.
దత్తన్న ఇంట్లో దొంగలు పడ్డారు
By: Tupaki Desk | 15 May 2016 10:18 AM GMT ఆయనో కేంద్ర మంత్రి... సీనియర్ నాయకుడు. ప్రత్యేక భద్రత ఏర్పాట్లను ప్రభుత్వం కల్పిస్తోంది. ఆయనకు వ్యక్తిగత భద్రత కల్పించడమే కాకుండా ఇంటివద్ద కూడా మంచి భద్రత ఉంది. అది కాకుండా నిత్యం అనుచరులు - కార్యకర్తలతో ఇంటి వద్ద ఆయనకు తెలియకుండా చీమ కూడా చొరబడనంత రక్షణ ఉంటుంది. అలాంటి ఇంట్లో దొంగలు పడ్డారు. అంతేకాదు.. సాక్షాత్తు కేంద్ర మంత్రి వాడే ఖరీదైన సెల్ ఫోన్ కొట్టేశారు. ఈ సంఘటన మంత్రుల ఇళ్లలో భద్రత ఎంత డొల్లో ఒక్కసారిగా బట్టబయలు చేసింది. ఈ సంఘటన ఎక్కడో ఉత్తర ప్రదేశో.. లేదంటే దోపిడీ రాజ్యం బీహార్లోనో జరగలేదు. మన తెలుగు రాష్ట్రం తెలంగాణలోని హైదరాబాద్ మహానగరంలోనే జరిగింది. విలువైన సెల్ ఫోన్ ను పోగొట్టుకున్నది ఇంకెవరో కాదు.. సీనియర్ బీజేపీ నేత - కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ.
కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ ఇంటిలో దొంగలు పడడం ఇప్పుడు సంచలనంగా మారింది. నిన్న రాత్రి ముషీరాబాదులోని దత్తాత్రేయ ఇంటిలోకి గుట్టు చప్పుడు కాకుండా చొరబడ్డ దొంగలు దత్తన్నకు చెందిన ఖరీదైన సెల్ ఫోన్ ను ఎత్తుకెళ్లారు. ఉదయం నిద్రలేచిన తర్వాత సెల్ ఫోన్ కోసం వెతికిన దత్తన్నకు అది కనిపించలేదు. ఇల్లంతా గాలించిన దత్తాత్రేయ... చోరులే తన సెల్ ఫోన్ ను ఎత్తుకెళ్లినట్లు నిర్ధారించుకున్నారు. దీంతో విషయాన్ని ఆయన తన పీఏకు చెప్పారు. మంత్రిగారి ఆదేశాలతో ఆయన పీఏ ముషీరాబాదు పోలీస్ స్టేషన్ కు వెళ్లి చోరీకి సంబంధించి ఫిర్యాదు చేశారు. దత్తన్న పీఏ నుంచి ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
అయితే.. నిత్యం కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉండే కేంద్ర మంత్రి ఇంట్లోకి బయట దొంగలు ప్రవేశించడం అంత సులభం కాదని పోలీసులు చెబుతున్నారు. ఇది ఆయన చుట్టూ నిత్యం ఉండేవారిలో ఎవరో ఒకరు చేసిన పనైనా కావొచ్చు. లేదంటే బయట ఎక్కడైనా పోగొట్టుకుని ఉండొచ్చని చెబుతున్నారు. అలా కాని పక్షంలో ఇంట్లోనే ఎక్కడైనా పెట్టి మరిచిపోయినా మర్చిపోయే అవకాశం ఉందన్న వాదనా వినిపిస్తోంది. ఏదైనాసరే కేంద్ర మంత్రి సెల్ ఫోన్ కనిపించకపోవడంతో అది ఎవరికైనా దొరికితే అందులో ఉన్న ప్రముఖుల నంబర్లను తప్పుడు పనులకు వాడుకునే అవకాశాలున్నాయని పోలీసులు చెబుతున్నారు. దీంతో కేంద్ర మంత్రి సెల్ ఫోన్ కోసం పోలీసులు వేట మొదలుపెట్టారు.