Begin typing your search above and press return to search.
హైదరాబాద్ కు మోడీ అన్ని వేల కోట్లు ఇచ్చారా?
By: Tupaki Desk | 30 Jan 2016 7:24 AM GMTఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపనకు వచ్చిన ప్రధాని మోడీ తట్టెడు మట్టి.. లొట్టెడు నీళ్లు ఇచ్చి పోయారంటూ తెలంగాణ మంత్రి కేటీఆర్ విరుచుకుపడితే.. అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి వెళ్లిన తాను అమరావతికి తెలంగాణ తరఫున ఏదైనా ప్రకటించాలని బలంగా అనుకున్నానని.. అదే విషయాన్ని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు.. ఏపీ మంత్రి యనమల రామకృష్ణుడుకు చెప్పినట్లుగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పటం తెలిసిందే. అయితే.. శంకుస్థాపనకు వచ్చిన ప్రధాని ఏపీకి ఏమీ ఇవ్వకుండా.. తాను మాత్రం ఇస్తే బాగోదన్న ఉద్దేశంతో మౌనంగా ఉన్నట్లుగా వెల్లడించారు.
ఇలా మోడీ చేసిందేమీ లేదంటూ విరుచుకుపడిన కేసీఆర్.. ప్రధానిగా మోడీ బాధ్యతలు చేపట్టిన 19 నెలల్లో ఒక్కసారి కూడా హైదరాబాద్ కు వచ్చింది లేదని.. తెలంగాణ పట్ల వివక్ష ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. మోడీ తీరుతో తెలంగాణ హర్ట్ అవుతుందన్న కీలక వ్యాఖ్య చేశారు. హైదరాబాద్ కు రాని మోడీ స్మార్ట్ సిటీల కేటాయింపు జాబితాలో కూడా తెలంగాణకు ఒక్కటంటే ఒక్కటి దక్కలేదంటూ మండిపడ్డారు. అయితే.. మూడు ప్రతిపాదనలకు ఒక్క ప్రతిపాదన మాత్రమే కేసీఆర్ సర్కారు పంపిందని. అది కూడా అరకొర ఉండటంతో స్మార్ట్ సిటీల ఎంపికకు పెట్టిన కటాఫ్ మార్కులకు బెత్తడు దూరంలో నిలిచిపోయిన విషయం బయటకు వచ్చిన సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే.. హైదరాబాద్ మీద మోడీ సర్కారు వివక్ష ప్రదర్శిస్తుందన్న ఆరోపణపై కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇప్పటివరకూ హైదరాబాద్ అభివృద్ధి కోసం రూ.6630 కోట్లను కేంద్రం ఇచ్చిందని.. ఒక్క మెట్రో రైల్ కోసమే రూ.2వేల కోట్లను ఇచ్చిందని లెక్కలు చెప్పుకొచ్చారు. దత్తన్న లెక్కలు చూస్తే.. హైదరాబాద్ (తెలంగాణ రాష్ట్రానికి కాదు సుమా) నగరానికే దాదాపుగా రూ.8.6వేల కోట్లు ఇచ్చినట్లు తేలుతుంది. ఈ లెక్కన కేటీఆర్ చెప్పినట్లుగా అమరావతికి తట్టెడు మట్టి.. లొట్టెడు నీళ్లతో పోలిస్తే.. హైదరాబాద్ కు ఇన్ని వేల కోట్లు ఇవ్వటం గొప్పే కదా? ఈ లెక్కన మోడీ ఎవరిపట్ల వివక్ష ప్రదర్శిస్తున్నట్లు?అన్న ప్రశ్న వేసుకుంటే వాస్తవం ఏమిటో అర్థమైపోవటం ఖాయం.