Begin typing your search above and press return to search.
దత్తన్న సతీమణికి తీవ్ర అనారోగ్యం!
By: Tupaki Desk | 3 Jun 2018 4:45 AM GMTఎదిగిన కొడుకు మరికొద్ది రోజుల్లో చేతికి అంది వస్తాడన్న ఆనందంలో ఉన్న తండ్రికి.. ఆ కొడుకు అందనంత దూరాలకు వెళ్లిపోవటానికి మించిన ఆవేదన మరొకటి ఉండదు. అందునా.. ఎలాంటి ఆరోపణలు.. విమర్శలు లేకుండా లో ప్రొఫైల్ మొయింటైన్ చేస్తూ.. తండ్రికి ఎప్పుడూ తలవంపులు తీసుకురాని కొడుకు ఆకస్మిక మరణానికి మించిన వేదన ఇంకేం ఉంటుంది.
అప్పటివరకూ అందరితో కులాశాగా కబుర్లు చెప్పిన దత్తన్న కుమారుడు బండారు వైష్ణవ్ ఆకస్మిక మృతి అందరిని తీవ్రంగా కలిచివేసేలా చేసింది. ఆ కుటుంబంతో ఏ మాత్రం సంబంధం లేని వారు సైతం దత్తన్నకు ఎదురైన శోకానికి ఫీలైన వారే. బయటోళ్లకే అంత ఆవేదనకు గురి చేసిన ఈ వైనం.. ఇంట్లో వారికి మరెంతటి మనస్తాపానికి గురి చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు.
కొడుకు అర్థాంతంగా వెళ్లిపోవటాన్ని జీర్ణించుకోలేని దత్తన్న సతీమణి వసంత తీవ్ర అస్వస్థతకు గురైనట్లుగా చెబుతున్నారు. శనివారం కొడుకు దశదిన కర్మల్లో పాలు పంచుకున్న ఆమె సాయంత్రానికి తీవ్ర అస్వస్థతకు గురి కావటంతో ఆమెను హుటాహుటిన కిమ్స్ కు తరలించారు.
వైష్ణవ్ మృతి చెందిన నాటి నుంచి వసంత తీవ్ర ఆవేదనతో ఉన్నారు. కొడుకు గురుతులతో ఆమె పడుతున్న వేదన అందరిని కలిచివేస్తోంది. ఇదిలా ఉంటే.. తీవ్ర మనో వ్యధతో ఉన్న ఆమె తీవ్ర అనారోగ్యానికి గురైనట్లుగా చెబుతున్నారు. ప్రస్తుతం కిమ్స్ ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్న ఆమె ఆరోగ్యం మెరుగు పడినట్లు వైద్యులు చెబుతున్నారు. మరోవైపు.. ఈ రోజు (ఆదివారం) వైష్ణవ్ పుణ్యవచనం కార్యక్రమాన్ని సికింద్రాబాద్‌లోని రాజరాజేశ్వరి గార్డెన్ లో నిర్వహిస్తున్నారు.