Begin typing your search above and press return to search.
నాడు కాళ్లు పట్టుకొని.. నేడు విమర్శలా బాబు
By: Tupaki Desk | 24 Dec 2018 6:20 AM GMTఏపీ ముఖ్యమంత్రి - తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తీరుపై బీజేపీ నేత - ఎంపీ బండారు దత్తాత్రేయ మండిపడ్డారు. ఆయన ద్వంద్వ విధానాలను తీవ్రంగా ఎండగట్టారు. ముఖ్యమంత్రి కావాలన్న ఆకాంక్షతో చంద్రబాబు 2014 ఎన్నికల్లో నరేంద్రమోడీ కాళ్లు పట్టుకొని పొత్తు కుదుర్చుకున్నారని - పదవి వచ్చాక నేడు విమర్శిస్తున్నారని ఆయన విరుచుకుపడ్డారు. హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీఆర్ ఎస్ తో బీజేపీకి ఎలాంటి ఒప్పందంలేదని - రాష్ట్ర పథకాల గురించి ప్రభుత్వం ఇచ్చిన సమాచారం ఆధారంగానే కేంద్రమంత్రులు ప్రశంసిస్తున్నారని పేర్కొన్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ - టీడీపీ ఖాళీ అయిపోతున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. తాజాగా జరిగిన ఎన్నికలతో ఈ విషయంలో స్పష్టమైందని పేర్కొన్నారు. టీడీపీ - కాంగ్రెస్ కు ఓటువేస్తే టీఆర్ ఎస్ కు ఓటు వేసినట్లేనని తాము ఎన్నికల సమయంలోనే ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్ - టీడీపీలు ఖాళీ అయ్యాయని, టీఆర్ ఎస్ కు సరైన ప్రత్యామ్నాయం బీజేపీయేనని వెల్లడించారు. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణలో మెజార్టీ స్థానాలను తమ పార్టీ గెలుచుకుందని చెప్పారు. జనవరి 11న ఢిల్లీలో అమిత్ షా ఆధ్వర్యంలో బీజేపీ జాతీయ కౌన్సిల్ సమావేశం జరుగుతందని - ఈ సమావేశం అనంతరం పార్లమెంటు ఎన్నికలపై దృష్టిపెడతామని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి - రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ జరిగిందని ఆయన అన్నారు.