Begin typing your search above and press return to search.
షాకింగ్ ఆరోపణ: ‘హైదరాబాద్లో హిందువుల ఓట్లు తొలగించారు’
By: Tupaki Desk | 9 Nov 2020 6:22 PM GMTగడిచిన కొద్దిరోజులుగా తెలంగాణ రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్ కు.. భారతీయ జనతాపార్టీకి మధ్య మాటల యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. దుబ్బాక ఉప ఎన్నిక షురూ అయిన నాటి నుంచి పరిస్థితుల్లో చాలానే మార్పులు వచ్చాయి. మూడో స్థానంలో ఉంటుందని భావించిన బీజేపీ.. అధికార టీఆర్ఎస్ కు పోటాపోటీ ఇవ్వటమే కాదు.. కంటి నిండా కుదురైన నిద్ర లేకుండా చేసిందన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.
ఇదే విషయాన్ని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మొదలు.. పలువురు నేతలు పదే పదే ప్రస్తావిస్తున్నారు. అధికార టీఆర్ఎస్ నేతలకు చిరాకు పుట్టేలా.. వారి వ్యాఖ్యలు ఉంటున్నాయి. గులాబీ నేతల్ని వీలైనంతగా ఇరిటేట్ చేయాలన్న వ్యూహం బీజేపీ నేతల్లో కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోందని చెబుతున్నారు. దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం రేపు (మంగళవారం) వెల్లడి కానుంది. దుబ్బాక గెలుపు మీద పెద్దగా మాట్లాడని బీజేపీ నేతలు.. ఇప్పుడు ఫోకస్ అంతా గ్రేటర్ మీద పెట్టినట్లుగా కనిపిస్తోంది.
దీనికి తగ్గట్లే.. వారి తాజా వ్యాఖ్యలు ఉన్నాయి. ఇటీవల విడుదల చేసిన గ్రేటర్ ఓటర్ల ముసాయిదా పైన సంచలన ఆరోపణలు చేస్తున్నారు బీజేపీ నేతలు. నగరాన్నిమజ్లిస్ కు అప్పగించారని.. హైదరాబాద్ ను ఏం చేద్దామని అనుకుంటున్నారని ప్రశ్నిస్తున్నారు బండి సంజయ్. మజ్లిస్ నేతలు ఎప్పుడు ప్రగతిభవన్ వెళ్లినా అపాయింట్ మెంట్ దొరుకుతుందని.. తెలంగాణ మంత్రులకు మాత్రం అపాయింట్ మెంట్ దొరకదన్న ఘాటు వ్యాఖ్య తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఇరకాటంలో పడేలా చేస్తుందని చెప్పక తప్పదు.
అంతేకాదు.. హైదరాబాద్ లోని పలు డివిజన్లలో హిందువుల ఓట్లను తీసివేశారని. .ముస్లిం ఓట్లను పెంచినట్లుగా తీవ్రమైన ఆరోపణ చేశారు. తాము ఉత్తగా మాటలు చెప్పటం లేదని.. తమ మాటలకు ఆధారాలు ఉన్నాయంటూ వారు వెల్లడిస్తున్న వివరాలు ఇప్పుడు సంచలనంగా మారుతున్నాయి.
బోలక్ పూర్ లో 79నుంచి 93 పోలింగ్ బూతుల్లో ముస్లిం ఓట్లను 5వేల వరకు పెంచారని. అంబర్ పేట 140 నుంచి 150 పోలింగ్ బూతుల్లో ముస్లిం ఓట్లను 4వేల వరకు పెంచారన్నారు.చంద్రాయణగుట్ట ఉప్పుగూడాలో 50 శాతం హిందువులు ుంటే.. 45 శాతానికి తగ్గించారని.. బోరబండలో 26వేల హిందువుల ఓట్లను తొలగించినట్లుగా పేర్కొన్నారు.
గోషామహాల్ లో 15వేల ఓట్లను తొలగించారన్నారు. ఈ నియోజకవర్గాన్ని బీజేపీ ప్రాతినిధ్యం వహిస్తున్నసంగతి తెలిసిందే. నెల రోజుల నుంచి ఎన్నికల సంఘాన్ని కలవటానికి సమయం అడిగితే.. వారు టైం ఇవ్వటం లేదన్న బీజేపీ.. ఎన్నికల సంఘం చట్టానికి అతీతం కాదన్నారు. బీజేపీ అభ్యంతరాల్ని పరిష్కారించే వరకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయొద్దని బండి సంజయ్ డిమాండ్ చేస్తున్నారు. త్వరలో హైదరాబాద్ లో తాము పాదయాత్ర చేయనున్నట్లుగా చెప్పిన బండి సంజయ్ మాటలు ఇప్పుడు సంచలనంగా మారాయని చెప్పక తప్పదు.