Begin typing your search above and press return to search.
కేసీఆర్ కార్యక్రమానికి దారుసలాం.. అనుమతి: బండి వ్యాఖ్యలు
By: Tupaki Desk | 17 Sep 2022 7:30 AM GMTకేంద్ర ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలను అధికారికంగా నిర్వహిస్తామని ప్రకటించిన తర్వాత.. కేంద్రానికి భయపడి.. సీఎం కేసీఆర్ ఉత్సవాల నిర్వహణకు పూనుకున్నారని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు.
తెలంగాణ విమోచన దినోత్సవంలో భాగంగా.. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్ర పటానికి సంజయ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ తరుణ్ చుగ్, జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ నివాళులు అర్పించారు.
అనంతరం దేశానికి స్వాతంత్య్రం వచ్చిన ఏడాది తర్వాత తెలంగాణకు నిజాం పాలన నుంచి విముక్తి లభించిందని బండి సంజయ్ పేర్కొన్నారు. నాటి దేశ హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ సెప్టెంబర్ 13న ఆపరేషన్ పోలోను ప్రారంభిస్తే, 17వ తేదీన ప్రజలకు విముక్తి లభించిందని, దీన్నే తెలంగాణ విమోచన దినోత్సవంగా నేడు జరుపుకుంటున్నామన్నారు. ఈ పోరాటంలో చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్య లాంటి ఎందరో మహానుభావులు నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడారన్నారు. వీరి అందరి త్యాగాల ఫలితమే నేడు ఈ తెలంగాణ అన్నారు.
తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని బీజేపీ ఎన్నో ఏళ్లుగా పోరాటం చేసిందని సంజయ్ అన్నారు. దారుసలాం నుంచి అనుమతి లభించాకే తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా ఈ వేడుకలను నిర్వహిస్తామని ప్రకటించిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
హైదరాబాద్లోని మల్కాజిగిరిలో ఉన్న హాస్టళ్లలో పాచిపోయిన అన్నం పెడుతున్నారని, ఎందరో త్యాగాల ఫలితంగా సాధించుకున్న తెలంగాణలో ఇంత ఘోరమైన పరిస్థితి ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు.
వెంకయ్య కూడా..
నాంపల్లి చౌరస్తాలో జరిగిన వేడుకలలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పాల్గొన్నారు. సెప్టెంబర్ 17 తెలంగాణ చరిత్రలో చరిత్రాత్మక రోజు అని, వివాదాల్లేకుండా వేడుక జరుపుకోవాలని అన్నారు. నాంపల్లి అసెంబ్లీ చౌరస్తాలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి ఆయన పూలమాల వేసి నివాళులర్పించారు. కుల, మత బేధాల్లేకుండా జాతి సమైక్యత కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని వెంకయ్యనాయుడు తెలిపారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.