Begin typing your search above and press return to search.
కేసీఆర్ కబంద హస్తాల్లో తెలంగాణ.. విముక్తి కల్పిస్తాం: బండి కామెంట్స్
By: Tupaki Desk | 13 Sep 2022 1:30 AM GMT``కేంద్రం తీసుకువచ్చిన కొత్త విద్యుత్ బిల్లులో మోటర్లకు మీటర్లు పెడతామని రాసి ఉంటే నేను రాజీనామా చేస్తా... లేకుంటే సీఎం కేసీఆర్ రాజీనామా చేయాలి. పాత పేపర్లు అసెంబ్లీలో చూపెట్టి అబద్దాలు చెబుతున్నారు`` అని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ నిప్పులు చెరిగారు. విద్యావ్యవస్థను చిన్నాభిన్నం చేశారని అన్నారు. హాస్టళ్లలో నీళ్లు లేవు. పురుగుల అన్నం పెడుతున్నారని మండిపడ్డారు. రాంలీలా మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడిన బండి సంజయ్.. కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు. కేసీఆర్ కబంధ హస్తాల్లో చిక్కుకున్న తెలంగాణకు విముక్తి కల్పిస్తామని పేర్కొన్నారు.
పోలీసులు, టీఆర్ ఎస్ గుండాలు అడ్డుకున్నా... తాను చేపట్టిన పాదయాత్ర ఆగలేదని సంజయ్ అన్నారు. బండి సంజయ్ 4వ ప్రజా సంగ్రామ యాత్ర కుత్భుల్లాపూర్‌లోని రాంలీలా మైదానంలో ప్రారంభమైంది. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో బండి సంజయ్.. ముఖ్యమంత్రిపై విమర్శల వర్షం కురిపించారు. అసోం సీఎంకు భద్రత కల్పించలేని దురవస్థ ఏర్పడిందని మండిపడ్డారు. ధర్మం కోసం, సమాజం కోసం బీజేపీ పోరాడుతోందని హితవు పలికారు. కేసీఆర్ కు రోజులు దగ్గర పడ్డాయని.. ఆయనకు జైలు జీవితం తప్పదని సంచలన వ్యాఖ్యలు చేశారు.
వినాయక నిమజ్జనంలో అసోం సీఎం వస్తే టీఆర్ ఎస్ నేతలు అడ్డుకున్నారని అన్నారు. ధర్మం కోసం, ప్రజల కోసం కొట్లాడుతున్నామని చెప్పిన సంజయ్.. జీడిమెట్ల పారిశ్రామిక ప్రాంతమని, ఇక్కడ ఏ పరిశ్రమ వచ్చినా కేసీఆర్ వసూళ్లకు భయపడి పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు తరలిపోతున్నాయని ఆరోపించారు. ``ఇక్కడ నీరు, గాలి పూర్తిగా కలుషితమైపోయింది. రోడ్లు లేవు... డ్రైనేజి వ్యవస్థ సరిగ్గా లేదు. వరదలు, వర్షం వస్తే హైదరాబాద్‌లో ఇల్లు మునిగిపోతున్నాయి. ప్రశ్నిస్తే మతతత్వం అంటున్నారు`` అని మండి పడ్డారు. 17వ తేదీన తెలంగాణ విమోచన దినాన్ని పరేడ్ గ్రౌండ్‌లో కిషన్ రెడ్డి నేతృత్వంలో జరుపుతామన్నారు.
వారు నిజాం వారసులు..
దారుసలాంలో సమావేశం తరవాత సీఎం కేసీఆర్ జాతీయ సమైఖ్యత దినోత్సవం జరుపుతున్నారని విమర్శించారు. తెలంగాణ ప్రజలను నిజాం నవాబులు చిత్రహింసలకు గురిచేశారని గుర్తు చేశారు. నాటి నిజాం వారసులే నేటి ఎంఐఎం నేతలని అభివర్ణించారు. ఈడీ కేసుల్లో, లిక్కర్ మాఫియాలో కేసీఆర్ కుటుంబసభ్యులే ఉన్నారని ఆరోపణలు చేశారు. 'ఆర్ఆర్ఆర్'కు మరో ఆర్ జోడిస్తామని పేర్కొన్నారు. మునుగోడులో రాజగోపాల్‌రెడ్డి గెలవబోతున్నారని జోస్యం చెప్పారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.