Begin typing your search above and press return to search.
భారీ టార్గెట్‌తో ఉన్న బండి సంజయ్... పదవి చేపట్టి రెండేళ్లు
By: Tupaki Desk | 12 March 2022 2:30 AM GMTతెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ మరోమారు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర రథసారథి బాధ్యతలు చేపట్టి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా బండి సంజయ్ కుమార్ ను పార్టీ సీనియర్ నేతలు, నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఈరోజు సాయంత్రం జరిగిన ‘ఆశీర్వచన’ కార్యక్రమానికి భారీ ఎత్తున నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. రాష్ట్రంలోని వివిధ ఆలయాల నుండి వచ్చిన వేద పండితులు, పూజారులు వేద మంత్రోచ్చారణాలతో ఆశ్వీరదించారు. పార్టీ సీనియర్లు డాక్టర్ కె.లక్ష్మణ్, ఇంద్రసేనారెడ్డి, విజయశాంతి, రఘునందన్ తదితరులు పుష్పగుచ్చం, శాలువాతో సంజయ్ ను సత్కరించారు.
ఆశీర్వచన కార్యక్రమం సందర్భంగా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ బండి సంజయ్ సారథ్యంలో రెండేళ్ల కాలంలో చేపట్టిన పార్టీ కార్యక్రమాలను, సాధించిన విజయాలను వివరించారు. అనంతరం బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ ఇంత గొప్ప పార్టీలో ఉన్నందుకు గర్వంగా ఉందని, ప్రధాని మోడీ స్పూర్తితో ముందుకు సాగుతున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో ప్రజలు విసిగిపోయారని పేర్కొంటూ వారికి భరోసా కల్పించేందుకు, ప్రభుత్వాన్ని నిలదీసేందుకు బీజేపీ ఈ రెండేళ్ల కాలంలో అనేక కార్యక్రమాలు చేపట్టిందని తెలిపారు. రైతులు, మహిళలు, ఉద్యోగులు, నిరుద్యోగుల కోసం ఉద్యమాలు చేశామని వివరించారు.
బీజేపీ అధికారంలోకి వచ్చే సమయంలో కేసీఆర్ మరోసారి తెలంగాణ సెంటిమెంట్ ను రెచ్చగొడుతూ బీజేపీని, కేంద్రాన్ని బదనాం చేయడమే పనిగా పెట్టుకున్నారని బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు. టీఆర్ఎస్ డౌన్ ఫాల్ క్లైమాక్స్ కు చేరిందని, అందుకే కేంద్రాన్ని బదనాం చేయడమే లక్ష్యంగా డబ్బులిచ్చి స్ట్రాటజీ టీం లను పెట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఎవరెన్ని కుట్రలు చేసినా ప్రజలు బీజేపీవైపే ఉన్నారని సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. ``బెంగాల్ తరహా రాజకీయాలు చేసినా, తాలిబన్, రజాకార్ల పాలన చేసినా ఎదిరించి పోరాడేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. కల్వకుంట్ల పాలనను భూస్థాపితం చేస్తాం. ప్రజాస్వామిక తెలంగాణ సాధిస్తాం. `` అని సంజయ్ పేర్కొన్నారు. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు తొలి దశ ప్రజా సంగ్రామ యాత్ర చేశామని పేర్కొన్న సంజయ్ ఏప్రిల్ 14 నుండి రెండో దశ పాదయాత్రను ప్రారంభించబోతున్నామని సంజయ్ తెలిపారు.