Begin typing your search above and press return to search.
కేసీఆర్ చెలరేగిపోయిన వేళ బండి ఊరుకుంటారా? భారీ కౌంటర్ ఇచ్చేశారు
By: Tupaki Desk | 11 July 2022 8:30 AM GMTవారం క్రితం సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్ లో లక్షలాది మందిని ఉద్దేశించి దేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించటం.. అందరి అంచనాలకు భిన్నంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పేరును కానీ.. ప్రస్తావించి కానీ విమర్శు చేసింది లేదు. ఇదిలా ఉంటే.. సరిగ్గా వారం తర్వాత.. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రెస్ మీట్ షెడ్యూల్ కావటం తెలిసిందే. అంచనాలకు మించిన హాట్ వ్యాఖ్యలతో తెలంగాణ రాజకీయాల్లో మరింత హీట్ ను నింపేస్తూ మోడీ అండ్ కో మీద పరుష వ్యాఖ్యల్ని సంధించిన వైనం తెలిసిందే.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న కేసీఆర్ లాంటి నేత ఇంత తీవ్రంగా మాట్లాడేసి.. కొన్ని అనవసరమైన అంశాల ప్రస్తావన తెచ్చిన తర్వాత.. వాటన్నింటికి కౌంటర్ ఇవ్వకుంటే తెలంగాణ బీజేపీ రథసారధి బండి సంజయ్ ఊరుకుంటారా? చెప్పండి. మొన్నటికి మొన్న జరిగిన బహిరంగ సభలో.. ప్రధాని నరేంద్ర మోడీని తన దేవుడిగా అభివర్ణించిన బండి సంజయ్.. తాజాగా కేసీఆర్ చేసిన ఘాటు విమర్శలు.. ఆరోపణలకు స్పందించకుండా ఉంటారా చెప్పండి.
ముఖ్యమంత్రి కేసీఆర్ మీద బండి సంజయ్ చేసిన ఘాటు వ్యాఖ్యల్లో మిస్ కాకూండా ఉన్న వాటిని చూస్తే..
- జీడిగింజ జీడిగింజ... సిగ్గులేదా? అంటే నల్లగున్న నాకెందుకు సిగ్గు అని అన్నదంట.. కేసీఆర్ సంగతి కూడా అట్లనే ఉంది... జాతీయ కార్యవర్గ సమావేశాల్లో మేం ఏం మాట్లాడుకున్నమో... ఈ పీకుడుగానికి ఏం తెలుసు? మాకేం లేదా... ఏం లేనిదే.. 18 రాష్ట్రాల్లో అధికారంలో ఉంటమా? నీ లెక్క తాగి ఫాంహౌజ్ లో పడుకున్నమనుకుంటున్నవా? సీఎం స్థాయి వ్యక్తి కాయిల్ తప్పి అడ్డగోలుగా మాట్లాడుతుంటే తెలంగాణ సమాజం సిగ్గుతో తలదించుకుంటోంది.
- హిందుగాళ్లు.. బొందుగాళ్లంటే కరీంనగర్ లో బొంద పెట్టిన సంగతి మర్చిపోయిండు... జోగులాంబ అమ్మవారు శక్తిపీఠం. అమ్మవారిని పట్టుకుని ఈ అంబ... ఆ అంబని చులకనగా మాట్లాడుతవా? నీకు మూడింది.. దగ్గర పడింది. రాసేటోడికైనా సిగ్గుండాలె. నువ్వు దేవుడిని తిడతవా?.. ధర్మాన్ని తిడతవా? ఎందుకు బతుకున్నతో అర్ధం కావడం లేదు. హిందువుల మనోభావాలను కించపర్చేలా మాట్లాడతవా? అదే నీ రాజకీయానికి సమాధి అవుతుంది గుర్తుంచుకో. వెంటనే ప్రజలకు క్షమాఫణ చెప్పాలి.
- ప్రధాని పదవిని గౌరవిస్తవా? యోగి ఆదిత్యనాథ్ ను కించపరుస్తవా? ఇక్కడ అమ్మాయిలపై అత్యాచారాలు జరుగుతుంటే కనీసం పట్టుకోలేని నువ్వా యోగి గురించి మాట్లాడేది? అక్కడ తప్పు చేయాలంటే భయపడే స్థాయికి తీసుకొచ్చిన యోగి గురించి మాట్లాడతావా?
- ఒకప్పుడు మోదీగారి గురించి ఏమన్నవో తెల్వదా? ఎట్లా పొగిడినవో తెల్వదా? (మోదీని పొగడ్తల్లో ముంచెత్తుతూ కేసీఆర్ మాట్లాడిన వీడియోలను ప్రదర్శిస్తూ) కళ్లు నీకు అప్పుడు దొబ్బినయా? ఇప్పుడు దొబ్బినయా? అప్పుడేమో మోదీగారిది నీతివంతమైన పాలన అని పొగుడుతావ్. ఇప్పుడేమో అవినీతి పాలన అంటావా? దమ్ముంటే. అవినీతి చూపించు. నాకు అధికారమిస్తే... మోడల్ తెలంగాణను దేశానికి చూపిస్తడట... ఏం చూపిస్తవ్.. తాగి ఫాంహౌజ్ లో పడుకున్నది చూపిస్తవా? నువ్వు, నీ కుటుంబం తెలంగాణను దోచుకున్న తీరును చూపిస్తవా? విజయ్ మాల్యా, నీరవ్ మోదీల ఆస్తులను ఈడీ అటాచ్ చేసిన సంగతి మర్చిపోయినవా? 19 వేల 111 కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. 15 వేల 114 కోట్లను వాళ్లు ఆల్రెడీ చెల్లించారు. ఇంకా డబ్బులు కడతాం.. అరెస్ట్ చేయొద్దని దండం పెడుతూ బతిమాలుతున్న సంగతి గుర్తుంచుకో.
- తెలంగాణ మొత్తం వరదలతో మునిగిపోతోంది. నువ్వు గతంలో ఏం జెప్పినవ్? ఇస్తాంబుల్, లండన్, న్యూయార్క్ అన్నవ్ కదా. ఏవి? జనం నిలదీస్తారని తెలిసే దారి మళ్లించే మాటలు మాట్లాడుతున్నడు.ప్రజలు కష్టాల్లో ఉంటే బయటకు రావు. రైతులు నష్టపోతే బయటకు రావు.. నిరుద్యోగులు, ఇంటర్మీడియట్ విద్యార్థులు, ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్య చేసుకుంటే బయటకు రాని నువ్వు దేశ్ కీ నేతట.
- మోదీకి, ఈయనకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. మోదీ రోజుకు 18 గంటలు పనిచేస్తే.. నువ్వు ఫాంహౌజ్ నుండి బయటకే రావు. అధికారాన్ని విసిరికొడతవా? చెప్పుతో సమానమంటవా? నీ అహంకారం తలకెక్కింది. ప్రజలు నిన్ను నీ కుటుంబాన్ని విసిరిపడేసే రోజులు దగ్గరపడుతున్నయ్.
- మోదీ విదేశాలు తిరిగి దేశాన్ని ప్రగతి పథంలో తీసుకుపోతుంటే నువ్వేం చేస్తున్నవ్? ఫాంహౌజ్ లో పడుకుని ఏ సీసాలో ఏ బ్రాండ్ మందు ఉందో తాగి పండుకుంటున్నవ్. ఎవరు గోకినా.. గోక్కున్నా నువ్వు గీకుతవా?... బహుశా గజ్జి ఉన్నట్లుంది. అడ్డగోలుగా మాట్లాడుతున్నడు. నువ్వు దేశంలోని ప్రాజెక్టుల గురించి మాట్లాడతవా? నెట్టెంపాడు, కోయిల్ సాగర్, డిండి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుల గురించి మాట్లాడు దమ్ముంటే.. ఆర్డీఎస్ గురించి మాట్లాడు...
- కేసీఆర్ వంద సార్లు ఏక్ నాథ్ షిండే పేరు ప్రస్తావిస్తుండు. నీ పార్టీలో ఏక్ నాథ్ షిండేలు ఉన్నరని తెలిసి భయపడుతున్నడు. అందుకే టెన్షన్ పడి తెల్లారి లేస్తే షిండే గురించి మాట్లాడుతున్నడు. ఉంటదో పోతదో తెల్వని ప్రభుత్వం మీది. నీ బోడి ప్రభుత్వంలో ఉండటం అవసరమా? అని నీ పార్టీ ఎమ్మెల్యేలు ఆలోచిస్తున్నరు. మంచి పార్టీలోకి పోవాలని నీ పార్టీలోని ఏక్ నాథ్ షిండేలు ఆలోచిస్తున్నరని తెలిసి ఆ పేరే తీస్తున్నవ్.
- మేం అధికారం కోసమే ఆలోచిస్తే... ఉప ముఖ్యమంత్రి పదవి ఎందుకు తీసుకుంటవ్? మాకు అక్కడ సీఎం అయ్యే అవకాశమే ఉండేది.. నువ్వు చేస్తే సంసారం... ఇతరులు చేస్తే వ్యభిచారమా?.
అసలు నువ్వు ఇక్కడేం చేసినవో చెప్పు? దళితులకు సీఎం పదవి ఎందుకు ఇవ్వలేదు? రుణమాఫీ ఏమైంది? దళితులకు పది లక్షల సంగతేమైంది? ఉద్యోగులకు జీతాలు ఎందుకు ఇవ్వడం లేదు? నీ పాలనలో రైతులు, ఉద్యోగులు, నిరుద్యోగులు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నరు? ముందు వీటికి సమాధానం చెప్పు?