Begin typing your search above and press return to search.
టీఆర్ ఎస్‌లో ముగ్గురు ఏక్‌నాథ్ షిండేలు: కేసీఆర్‌కు బండి కౌంటర్
By: Tupaki Desk | 11 July 2022 5:30 AM GMTబీజేపీపైనా.. ప్రధాని నరేంద్ర మోడీపైనా తీవ్రస్థాయిలో విరుచుకుపడిన సీఎం కేసీఆర్‌కు బీజేపీ రాష్ట్ర చీఫ్ బండి సంజయ్ అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ ఇంట్లోనే ముగ్గురు ఏక్‌నాథ్ షిండేలు ఉన్నారని కామెంట్ చేశారు. టీఆర్ఎస్‌లో ఏదో అలజడి జరుగుతోందని, అందుకే కేసీఆర్ ఒక తీవ్రమైన గందరగోళంలో ఉన్నారని అన్నారు. కేసీఆర్ పార్టీలో ఏక్ నాథ్ షిండేలు ముగ్గురు ఉన్నారని జోస్యం చెప్పారు. వీరే కాకుండా.. ఇంకా చాలా మంది షిండేలు సీఎం సీటు కోసం కాచుకుని కూర్చున్నారని తెలిపారు.
కేసీఆర్ .. అల్లడు, కొడుకు, బిడ్డల్లో ఎవరైనా ఏక్ నాథ్ షిండేలు కావొచ్చని చెప్పారు. కోన్ కిస్కా గొట్టం కేసీఆర్‌కు ప్రధాని మోడీ సమాధానం చెప్పాలా అని బండిసంజయ్ ప్రశ్నించారు. తెలంగాణలో బీజేపీ గ్రాఫ్ వేగంగా పెరుగుతుందని.. టీఆర్ఎస్ గ్రాఫ్ అంతే వేగంగా పడిపోతుందని ఎద్దేవా చేశారు. తాము నోరు విప్పితే కేసీఆర్‌కు తల ఎక్కడ పెట్టుకోవాలో కూడా తెలియదన్నారు. నీరవ్ మోడీ, విజయ మాల్యా ఆస్తులను ఈడీ అటాచ్ చేసిన విషయం దేశ ప్రజలకు తెలుసునన్నారు. సొంత ప్రభుత్వ అవినీతి నుంచి ప్రజల దృష్టి మళ్ళించడానికే కేసీఆర్ విమర్శలు చేస్తున్నారని మండి పడ్డారు.
మోడీ పరిపాలనను గతంలో కేసీఆర్ పొగిడిన మాట వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. కేసీఆర్ సంస్కారహీనమైన భాషతో తెలంగాణ సమాజం సిగ్గుతో తల దించుకుంటోందన్నారు.
జోగులాంబ అమ్మవారిని కించపర్చిన కేసీఆర్ కుంటుంబం రాజకీయంగా సమాధి కావటం ఖాయమని శపించారు. హిందూ సమాజానికి సీఎం కేసీఆర్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మైనర్ బాలికలపై అత్యాచారాలను కంట్రోల్ చేయలేని చేతకాని దద్దమ్మ కేసీఆర్ అని బండి మండిపడ్డారు.
ప్రధాని మోడీకి.. కేసీఆర్‌కు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందన్న బండి.. కేసీఆర్‌కు కుటుంబాన్ని ఈడ్చి కట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని మండి పడ్డారు. ద్రౌపది ముర్ముకు ఓటు వేసి టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు దేశానికి మంచి సంకేతాలు పంపాలని పిలుపునిచ్చారు. దక్షిణ తెలంగాణను ఎడారిగా మార్చిన ఘనత కేసీఆర్ దేనని మండిపడ్డారు.
కేసీఆర్‌లో రజాకర్లు ఆవహించారని మండిపడ్డారు. అందుకే ఎమర్జెన్సీని కూడా పొగుడుతున్నారని అన్నారు. త్వరలో రానున్న రాజాకార్ల ఫైల్స్ సినిమా చూసి కేసీఆర్ గుండె ఆగుతోందని సంజయ్ వ్యాఖ్యానించారు.