Begin typing your search above and press return to search.
ఫాంహౌస్ లో కేసీఆర్.. కోచ్ ఫ్యాక్టరీ నిర్వహిస్తున్నారా?
By: Tupaki Desk | 25 April 2021 6:30 AM GMTఇప్పుడు ఎక్కడ చూసినా కరోనా మహమ్మారి మాటలే. పాజిటివ్ బారిన పడిన వారు.. వైద్యం కోసం పడుతున్న పాట్లు.. ఆసుపత్రుల్లో చేరేందుకు పడుతున్న ఆరాటం.. ఆక్సిజన్ కోసం.. రెమిడెసివర్ కోసం వారు చేస్తున్నఎక్కువగా ప్రయత్నాలు.. ఇలా నిత్యం వైరస్ చుట్టూనే జీవితం మొత్తం తిరుగుతోంది. ఇదిలా ఉంటే.. ఇలాంటి పరిస్థితుల్లోనూ తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల్ని నిర్వహించాలని ఎన్నికల కమిషన్ నిర్ణయించటం.. అందుకు అధికార పక్షం సానుకూలంగా ఉండటంతో ఎన్నికల ప్రక్రియ ఆగేట్లుగా కనిపించట్లేదు.
ఓపక్క ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్నికల నిర్వహణ ఏ మాత్రం మంచిది కాదని చెబుతున్నా.. కేసీఆర్ అండ్ కో మాత్రం ఆ విషయానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటం లేదు. దీంతో.. తమ వంతు ప్రచారాన్ని బీజేపీ నేతలు చేస్తున్నారు. తాజాగా వరంగల్ లో నిర్వహించిన సభలో మాట్లాడిన బీజేపీ రాష్ట్ర తెలంగాణ బాధ్యుడు బండి సంజయ్ నోటి నుంచి గతంలో ఎప్పుడూ రాని విచిత్రమైన వ్యాఖ్యలు వచ్చాయి.
సీఎం కేసీఆర్ తరచూ వెళ్లే ఫాంహౌస్ మీద ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ తన ఫాంహౌస్ లో కోచ్ ఫ్యాక్టరీని నిర్వహిస్తారని పేర్కొన్నారు. అందులో రాష్ట్ర ప్రజల్ని ఎలా దోపిడీ చేయాలో ఎమ్మెల్యేలకు శిక్షణ ఇస్తుంటారన్నారు. వరంగల్ జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలకు ఫాంహౌస్ లోని కోచ్ ఫ్యాక్టరీలో ఎక్కువగా మార్కులు వస్తున్నట్లుగా విమర్శించారు. వరంగల్ లోని ఎమ్మెల్యేల భూకబ్జాలు బయటకు రాకుండా ఉండేందుకే వరంగల్ పోలీస్ కమిషనర్ ప్రమోద్ కుమార్ ను ఆఘమేఘాల మీద బదిలీ చేయించారన్నారు.
ఇటీవల కాలంలో బండి సంజయ్ నోటి నుంచి వస్తున్న విమర్శలు రోటీన్ గా మారిపోయాయన్న మాట వినిపిస్తున్న వేళ.. సీఎం ఫాంహౌస్ ను ప్రస్తావించటం ద్వారా.. ప్రజల అటెన్షన్ ను తన వైపునకు తిప్పుకునే ప్రయత్నం చేశారని చెప్పక తప్పదు.