Begin typing your search above and press return to search.

షట్ అప్.. గెట్ అవుట్.. రిపోర్టర్ పై బండి చిందులు

By:  Tupaki Desk   |   1 May 2021 2:02 PM GMT
షట్ అప్.. గెట్ అవుట్.. రిపోర్టర్ పై బండి చిందులు
X
తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఊగిపోయారు. అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన టీ న్యూస్ రిపోర్టర్ పై లైవ్ లోనే చిందులు తొక్కారు. తెలంగాణలో కరోనా కట్టడిపై చర్యలు తీసుకోని సీఎం కేసీఆర్ అని బండి సంజయ్ విమర్శిస్తుండగా.. మధ్యలో అడ్డుకొని ప్రశ్నించిన టీ న్యూస్ రిపోర్టర్ పై తిట్ల వర్షం కురిపించారు.

తెలంగాణ బీజేపీ చీఫ్, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ తెలంగాణలో కోవిడ్ -19 పరిస్థితులపై మీడియాతో మాట్లాడారు. 77 మంది టిఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ కరోనాను కట్టడి చేయడం లేదని ఆరోపించారు. సీఎం కేసీఆర్ ఇంతవరకు ఎందుకు కరోనాపై సమీక్ష చేయలేదని.. ప్రజలకు భరోసా ఇవ్వడం లేదని నిప్పులు చెరిగారు. ఇక మంత్రి మల్లా రెడ్డిపై హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ, ఆయనపై ఎటువంటి కేసు నమోదు కాలేదని ఈటల వ్యవహారంలో మాత్రం ఎందుకు విచారణ జరిపారని బండి సంజయ్ నిలదీశారు. రాష్ట్రంలోని కోవిడ్ -19 సంక్షోభం నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి ఈటల నాటకం ఆడుతున్నారని ” బండి సంజయ్ ఆరోపించారు.

రాష్ట్రంలో ఆక్సిజన్ అవసరం గురించి సీఎం కేసీఆర్‌కు ఏమైనా అవగాహన ఉందా అని టి-బిజెపి చీఫ్ బండి ప్రశ్నించారు. “రాష్ట్రంలోని కోవిడ్ -19 పరిస్థితిని కేసీఆర్ సమీక్షించారా? వైరస్ కారణంగా రాష్ట్రంలో ఎంత మంది మరణించారో ఆయనకు తెలుసా? ” అని సంజయ్ ప్రశ్నించారు.

ఇందులో జోక్యం చేసుకున్న కేసీఆర్ అనుకూల టి-న్యూస్ చానెల్ రిపోర్టర్ ప్రశ్నించారు. బీజేపీ పాలించిన రాష్ట్రాల పరిస్థితులపై బండి సంజయ్ కు కౌంటర్ ఇచ్చారు. దీనిపై బండి ఊగిపోయారు. "చాలా మంది రాష్ట్ర సీఎంలు రోజూ కోవిడ్ -19ను సమీక్షిస్తున్నారు. కేసీఆర్ ఎక్కడ చేసారు? తన ఫామ్ హౌస్ లోనా? ఫామ్ హౌస్ లో కేసీఆర్ ఏమి చేస్తున్నాడో అందరికీ తెలుసు” అని బండి నిప్పులు చెరిగారు.

బీజేపీ రాష్ట్రాల్లోనే తెలంగాణ కంటే దారుణంగా పరిస్థితులున్నాయని.. మోడీ ఏం చేస్తున్నాడని టి-న్యూస్ రిపోర్టర్ లైవ్ లోనే సంజయ్‌తో వాదించాడు. నియంత్రణను కోల్పోయిన సంజయ్, "షట్ అప్, ఇక్కడి నుంచి బయటకు వెళ్లు గెట్ అవుట్.. నిన్ను ఇక్కడికి రానీయడమే ఎక్కువ" అని నోరుపారేసుకున్నారు. కేసీఆర్ ఇంతవరకు టీకా వేసుకోకుండా మాస్క్ పెట్టుకోకుండా తెలంగాణ ప్రజలకు ఏం మేసేజ్ ఇస్తున్నాడని బీజేపీ చీఫ్ బండి ప్రశ్నించారు.