Begin typing your search above and press return to search.
డిసెంబర్ 7న ఢిల్లీకి బండి సంజయ్ .. ఎందుకంటే ?
By: Tupaki Desk | 5 Dec 2020 12:33 PM GMTతెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ డిసెంబర్ 7వ తేదీన ఢిల్లీకి బాట పట్టనున్నారు. తెలంగాణ లో రోజురోజుకి బీజేపీ బలం పుంజుకుంటుంది. దుబ్బాక ఉపఎన్నికలో గ్రాండ్ విక్టరీ కొట్టిన బీజేపీ, దుబ్బాక విజయం తో రెట్టింపు ఉత్సాహం తో పని చేసి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లోనూ సత్తా చాటింది. ఈ నేపథ్యంలో బండి సంజయ్.. ఢిల్లీ పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది. ఆదివారం రోజు బండి.. ఢిల్లీకి వెళ్లనున్నట్టు సమాచారం. తన పర్యటనలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్రమంత్రి అమిత్ షా, మరికొందరు నేతలను కలిసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
జీహెచ్ ఎంసీ ఫలితాల వివరాలు జాతీయ నేతలకు తెలియజేయడంతో పాటు.. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగస్వాములైనవారికి కూడా కృతజ్ఞతలు చెప్పనున్నారని చర్చ సాగుతోంది. ఇకపోతే 150 స్థానాలున్న గ్రేటర్ లో ఎవ్వరికీ స్పష్టమైన మెజార్టీ రాని విషయం తెలిసిందే. టీఆర్ఎస్ 55 సీట్లలో విజయం సాధించగా.. బీజేపీ 48, ఎంఐఎం 44, కాంగ్రెస్ 2 స్థానాల్లో గెలుపొందాయి. మేయర్ పీఠం దక్కించుకోవాలంటే 76 స్థానాలు విజయం సాధించాల్సి ఉండగా.. ఒక్క పార్టీ కూడా మేజిక్ ఫిగర్ 60 దాటాకపోవడంతో హాంగ్ తప్పదని విశ్లేషకులు అంటున్నారు. ఈ నేపథ్యంలో తదుపరి కార్యాచరణపై జాతీయ నేతలతో బండి సంజయ్ చర్చిస్తారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేశారు.