Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ కు దమ్ముంటే భాగ్యలక్ష్మీ ఆలయంపై చేయి వేయండి: బండి సంజయ్

By:  Tupaki Desk   |   2 Jun 2022 2:30 PM GMT
కాంగ్రెస్ కు దమ్ముంటే భాగ్యలక్ష్మీ ఆలయంపై చేయి వేయండి: బండి సంజయ్
X
అటు బీజేపీ ఇప్పుడు అదే పనిలో ఉండగా.. ఇక కాంగ్రెస్ జతకలిసింది. సెక్యూలర్ అని చెప్పుకునే కాంగ్రెస్ చేసిన ఈ పని వివాదానికి దారితీసింది. చార్మినార్ లో నమాజ్ కోసం సంతకాల సేకరణపై రాజకీయ వివాదం ముదురుతోంది. కాంగ్రెస్ నేత రషీద్ ఖాన్ సంతకాల సేకరణ దుమారం రేపింది. దీనిపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రంగా విరుచుకుపడ్డారు.

కాంగ్రెస్ కు దమ్ముంటే భాగ్యలక్ష్మీ ఆలయంపై చేయి వేయాలంటూ ఎంపీ బండి సంజయ్ సవాల్ విసిరారు. ‘మేం భాగ్యలక్ష్మీ అమ్మవారిని దర్శించుకుంటేనే మీకు నమాజ్ గుర్తొచ్చిందా? అంతకుముందు నమాజ్ ఎందుకు చేయలేదు? కాంగ్రెస్, ఎంఐఎం , టీఆర్ఎస్ కలిసి డ్రామాలాడుతున్నాయని బండి సంజయ్ విరుచుకుపడ్డారు.

చార్మినార్ దగ్గర ఆలయం లేదని చెప్పేవాడు మూర్ఖుడు అంటూ బండి సంజయ్ తీవ్ర ఆరోపణలు చేశారు. సంతకాల సేకరణను ముస్లిం సమాజం సైతం హర్షించదని ఎమ్మెల్యే రాజాసింగ్ పేర్కొన్నారు. చార్మినార్ వద్ద సంతకాల సేకరణపై రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. షో పుటప్ ప్రోగ్రాం చేసేవాళ్లపై చర్యలు తీసుకోవాలని రాజాసింగ్ కోరారు. ఇలాగైతే మసీద్ వద్ద మేము కూడా సంతకాల సేకరణ చేయాలా? అని ప్రశ్నించారు.

తెలంగాణలో కాంగ్రెస్ ఎక్కడ ఉంది? కాంగ్రెస్ నేత రషీద్ ఖాన్ మీద సుమోటోగా కేసు నమోదు చేయాలని.. అసలు రషీద్ ఖాన్ కు సిగ్గుందా? అని రాజాసింగ్ ఫైర్ అయ్యారు. చార్మినార్ పూర్తిగా శిథిలావస్థకు చేరుకుందని.. అటు నుంచి పెద్ద వాహనాలు వెళితే కూలిపోయే స్థితిలో ఉందని బండి సంజయ్ గుర్తు చేశారు.