Begin typing your search above and press return to search.
బండి పాదయాత్రకు ప్లాన్ రెడీ.. అనుమతి ఇవ్వకుంటే అలా చేస్తారట
By: Tupaki Desk | 11 Sep 2022 4:31 AM GMTతెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ విడతల వారీగా పాదయాత్రను చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రతి సందర్భంలోనూ పాదయాత్రను మొదలు పెట్టిన వేళలో బహిరంగ సభ.. ముగింపువేళ బహిరంగ సభను నిర్వహిస్తున్న వైనం తెలిసిందే. తెలంగాణలో అధికారాన్ని సొంతం చేసుకోవటమే లక్ష్యంగా పాదయాత్ర సాగుతోంది. ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలతో పోలీసులు అనుమతి ఇస్తారా? లేదా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. విడతల వారీగా బండి నిర్వహిస్తున్న పాదయాత్రతో కేసీఆర్ సర్కారు చిరాకుకు గురవుతోంది. ఆయన చేసే వ్యాఖ్యలు పార్టీ అధినాయకత్వానికి ఇరిటేషన్ కు గురి చేస్తున్నాయి. మొదట్లో పెద్దగా పట్టించుకోని ఈ యాత్రపై తాజాగా సీఎం కేసీఆర్ కాసింత ఫోకస్ చేస్తున్నట్లుగా చెబుతున్నారు.
బండి సంజయ్ నాలుగో విడత పాదయాత్రకు పోలీసులు.. ప్రభుత్వం అనుమతి ఇచ్చినా ఇవ్వకున్నా.. తమ యాత్ర మాత్రం సాగటం ఖాయమని స్పష్టం చేస్తున్నారు. ప్రభుత్వం ఇవ్వకుంటే తాము కోర్టును ఆశ్రయించి యాత్ర కొనసాగిస్తామని చెబుతున్నారు. గతంలోనూ యాత్రకు ప్రత్యేకంగా రాతపూర్వక అనుమతి అంటూ ఇవ్వలేదని.. కాబట్టి ప్రత్యేకంగా అనుమతి తీసుకోవాలని తాము భావించటంలేదని బీజేపీ నేతలు చెబుతున్నారు.
బండి నాలుగో విడత పాదయాత్ర సోమవారం (సెప్టెంబరు 12న) ప్రారంభమై ఈ నెల 22న ముగియనుంది. హైదరాబాద్ శివారు కుత్భుల్లాపూర్ లోని చిత్తారమ్మ ఆలయంలో బండి సంజయ్ పూజలు చేసి పాదయాత్రగా బయలుదేరుతారని చెబుతున్నారు. ఈ గుడికి సమీపంలోని రాంలీలా మైదానంలో నిర్వహించే ప్రారంభ సభకు ముఖ్య అతిధిగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ హాజరుకానున్నారు.
ఈ పాదయాత్రతో బీజేపీ మల్కాజిగిరి పార్లమెంట్ స్థానంలోని కుత్భుల్లాపూర్.. కూకట్ పల్లి.. సికింద్రాబాద్.. కంటోన్మెంట్.. మల్కాజిగిరి.. మేడ్చల్.. ఉప్పల్.. ఎల్ బీ నగర్ తో పాటు ఇబ్రహీం పట్నం అసెంబ్లీ నియోజకవర్గాల్ని లక్ష్యంగా చేసుకున్నట్లుగా చెబుతున్నారు. ముగింపు సభను ఔటర్ రింగు రోడ్డుకు సమీపంలోని పెద్ద అంబర్ పేట వద్ద నిర్వహిస్తారు. గ్రేటర్ హైదరాబాద్ లోని సమస్యల్ని ప్రస్తావించటంతో పాటు..వేలాదిగా నిర్మించి ఇప్పటికి ఇవ్వని డబుల్ బెడ్రూం ఇళ్లు.. ట్రాఫిక్ నియంత్రణను పోలీసులు గాలికి వదిలేసిన తీరుతోపాటు ట్రాఫిక్ తో ప్రజలు పడుతున్న నరకయాతనను.. చెరువుల కబ్జా పైనా ప్రముఖంగా ఫోకస్ చేయనున్నట్లు చెబుతున్నారు.