Begin typing your search above and press return to search.
‘దళిత బంధు’కు బ్రేకు.. కేసీఆర్ కు కలిసి వస్తోందా?
By: Tupaki Desk | 19 Oct 2021 6:12 AM GMTతెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్లాగ్ షిప్ ప్రోగ్రాంగా మారిన ‘దళితబంధు’ అమలుకు తాత్కాలికంగా బ్రేకులు వేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల్ని జారీ చేయటం తెలిసిందే. నిజానికి ఈ చర్య కేసీఆర్ కు షాకిచ్చేలా మారిందన్న అభిప్రాయాల్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. కానీ.. లోతుగా చూస్తే.. ఈ నిర్ణయం తెలంగాణ అధికారపక్షానికి మేలు చేసేదిలా మారుతుందా? అన్నది ప్రశ్నగా మారింది. దీనికి కారణం.. తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలతో పాటు.. ఈ నిర్ణయంపై బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నోటి నుంచి వచ్చిన మాటలు కూడా ఈ అనుమానాల్ని మరింత బలపడేలా చేస్తున్నాయి.
దళితబంధు పథకాన్ని అమలు చేయాలని.. అందుకు పైలెట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్ నియోజకవర్గంలో అమలు చేయాలని కేసీఆర్ సర్కారు భావించటం తెలిసిందే. దీనికి కారణం.. ఉప ఎన్నికల్లో దళిత ఓటు బ్యాంకు ఎక్కువగా ఉండటమే. ఈ ఓటు బ్యాంకు మొత్తం గుత్తగా తమకు తరలాలంటే.. దళితబంధు లాంటి భారీ పథకం అమలు చేస్తే సానుకూలత వస్తుందన్న మాట వినిపిస్తోంది. ఈ పథకం రూపకల్పన చేసినప్పటికి.. అమలు చేసే నాటికి పరిస్థితుల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. హుజూరాబాద్ వరకే వస్తే.. తొలుత అనుకున్న దానితో పోలిస్తే.. తర్వాతి కాలంలో లబ్థిదారుల సంఖ్య పెరిగింది.
లబ్థిదారులుగా ఎంపికైన వారంతా ఫుల్ హ్యాపీ. కానీ.. ఈ పథకం పరిధిలోకి ఇప్పటివరకు రాని వారంతా గుర్రుగా ఉండటంతో పాటు.. ఇతర వెనుకబడిన వర్గాల వారు.. ఆర్థికంగా బలహీనమైన వారంతా టీఆర్ఎస్ మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంత భారీ పథకం అమలు సామాజిక అంశాల కంటే కూడా ఆర్థిక అంశాల్ని ప్రాధాన్యతగా తీసుకోవాల్సి ఉన్నప్పటికీ.. సీఎం కేసీఆర్ అలా చేయలేదన్న కోపం ఉంది. అలాంటి ఆగ్రహాన్ని తగ్గించేందుకు తాజాగా ముఖ్యమంత్రి నోటి నుంచి వచ్చిన ‘అందరిబంధు’ (అన్ని కులాల వారికి.. ఆర్థికంగా బలహీనమైన వారందరికి) పథకం మాట మేలు చేసే వీలుంది.
ఇక.. దళితబంధు పథకాన్ని తాత్కాలికంగా బ్రేక్ వేస్తూ ఈసీ తీసుకున్న నిర్ణయం.. లబ్థిదారులకు నిరాశ కలిగించే వీలుంది. దీనికి కారణం.. విపక్షాలే అన్న భావన కలగటం ఖాయం. అదే జరిగితే.. ఆగ్రహంతో తమకు పథకాన్ని అమలు కాకుండా తాత్కాలికంగా ఆగటానికి కారణమైన వారిని ఓటర్లు క్షమించరు. అదే జరిగితే.. దళితబంధుకు ఈసీ బ్రేకులు వేయటం తెలంగాణ అధికారపక్షానికి మేలే చేస్తుంది తప్పించి.. షాకిచ్చే అవకాశం లేదు. ఇంకా చెప్పాలంటే.. పథకం అమలు ఆగటానికి కారణం బీజేపీనే అన్న భావన కలుగుతుంది. అది ఆ పార్టీ అభ్యర్థి ఈటల రాజేందర్ ను నష్టం వాటిల్లేలా ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
దీనికి తగ్గట్లే బండి సంజయ్ తాజా వ్యాఖ్యలు ఇదే ఆందోళనను వ్యక్తం చేసేలా ఉండటం గమనార్హం. ముఖ్యమంత్రి కేసీఆర్ వల్లనే దళిత బంధు ఆగిందని ఆయన వ్యాఖ్యానించటం గమనార్హం. ఎక్కడైనా కొనసాగుతున్న ప్రభుత్వ పథకాన్ని కేంద్ర ఎన్నికల సంఘం నిలిపివేయదని.. ముఖ్యమంత్రి కేసీఆర్ దళితబంధును పూర్తిస్థాయిలోకాకుండా హుజూరాబాద్ వరకే అమలు చేయటం వల్లే ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని ఆయన వివరణ ఇవ్వటం చూస్తే.. ఈసీ తాజా నిర్ణయం కారణంగా వచ్చే వ్యతిరేకత తమకు తాకకూడదన్నట్లుగా బండి వ్యాఖ్యలు ఉండటం గమనార్హం. ఇదంతా చూసినప్పుడు ఈసీ వేసిన బ్రేకులు.. గులాబీ కారుకు మాత్రం కాదన్న మాట వినిపిస్తోంది.