Begin typing your search above and press return to search.
సీఎం కుర్చీ కోసం కొట్లాట షురూ.. బండి సంచలన కామెంట్లు!
By: Tupaki Desk | 27 Nov 2021 4:30 PM GMTతెలంగాణ బీజేపీ సారథి.. మాటల మాంత్రికుడు బండి సంజయ్.. తాజాగా హాట్ కామెంట్లు చేశారు. ముఖ్యమంత్రి కుర్చీ కోసం.. నాలుగు స్తంభాలాట ప్రారంభమైందని అన్నారు. ప్రగతి భవన్లో నాలుగు స్తంభాలాట మొదలైందని, తమనంటే తమనే సీఎంను చేయాలని కేసీఆర్ను.. కుమారుడు, కుమార్తె, అల్లుడు కూడా అడుగుతున్నారని బండి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కుటుంబ పాలనకు వ్యతిరేకంగా కలిసికట్టుగా చేస్తున్న పోరాటంతో అనేక మార్పులు సంభవించాయన్నారు.
ప్రజల దృష్టి మరల్చేందుకే సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లారని బండి విమర్శించారు. బీజేపీని అప్రతిష్ఠ పాలు చేసేందుకు కుట్రలు పన్నారని ఆరోపించారు. ప్రశ్నించే గొంతుకలను పార్టీ నుంచి బయటకు పంపిస్తున్నారన్న సంజయ్.. సీఎం పోకడలతో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మండిపడ్డారు.
రాష్ట్రంలో విద్యా వ్యవస్థ మొత్తం దెబ్బతిందని బండి సంజయ్ విమర్శించారు. ఎంబీసీ పేరుతో బీసీ కులాల మధ్య కేసీఆర్ చిచ్చుపెడుతున్నారని ఆరోపించారు. ప్రజల ఆశీర్వాదంతో 2023లో బీజేపీ అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. డిసెంబర్ 17 నుంచి రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర చేస్తామని తెలిపారు. బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక అర్హులైన పేదలందరికీ ఉచిత విద్య, వైద్యం అందిస్తామని బండి సంజయ్ హామీ ఇచ్చారు. పార్టీలో ఎవరు ముఖ్యమంత్రి అయినా.... ఉచిత విద్య, వైద్యం ఇప్పించే బాధ్యత తీసుకుంటానని అన్నారు.
ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టానని తెలిపారు. యాత్ర విజయ వంతం కావడంతో కేసీఆర్కు భయం పట్టుకుందని చెప్పారు. రెండో విడత ప్రజా సంగ్రామ యాత్రను డిసెంబర్ 17 నుంచి ప్రారంభిస్తానని వెల్లడించారు. రాష్ట్రంలో బీజేపీని మరింత బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు కలిసి సమష్టిగా కృషిచేయాలని పిలుపునిచ్చారు. పార్టీ కోసం శ్రమించే కార్యకర్తలను... నాయకులు గుర్తించి తగిన గుర్తింపు ఇవ్వాలని సూచించారు.