Begin typing your search above and press return to search.
కేసీఆర్ పై నిప్పులు చెరిగిన బండి.. ఏమన్నారంటే
By: Tupaki Desk | 5 Feb 2022 8:30 AM GMTతెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై.. బీజేపీ చీఫ్ బండి సంజయ్ మరోసారి నిప్పులు చెరిగారు. కేంద్ర బడ్జెట్ పై ఇటీవల తీవ్ర విమర్శలు చేసిన సీఎం కేసీఆర్.. రాజ్యాంగాన్ని మార్చాల్సిన అవసరం ఉంద న్నారు. ఈ వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్ కూడా కేసీఆర్‌పై విమర్శలు చేశారు. ఆయనకు అంత అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. ఇక, బండి కూడా ఇదే రేంజ్‌లో స్పందించారు. మార్చాల్సింది.. రాజ్యాంగాన్ని కాదని.. సీఎం కేసీఆర్‌నే మార్చాలని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మాణం, టీఆర్‌ఎస్ ముక్త్ తెలంగాణ కోసం తాము పోరాటం చేస్తున్నామని బండి తెలిపారు. దీనికి తెలంగాణ ప్రజలు తమతో కలిసి రావాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగాన్ని మార్చాలని సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ శుక్రవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్ నుంచి పార్లమెంటు వరకు పార్టీ నేతలతో కలిసి సంజయ్ పాదయాత్ర చేశారు. అనంతరం బండి మీడియాతో మాట్లాడుతూ.. రాజ్యాంగాన్ని మార్చాలని సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఆయన అహంకారానికి నిదర్శనమన్నారు.
టీఆర్‌ఎస్ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కండకావరమెక్కి వాగుతున్నారని మండిపడ్డారు. ‘‘దళితుణ్ని సీఎం చేయాలని.. దళిత బంధు ఇవ్వాలని.. దళితులకు మూడెకరాల భూమి ఇవ్వాలని రాజ్యాంగంలో ఉందా అని టీఆర్‌ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. మరి ఓడిపోయిన బిడ్డను తీసుకొచ్చి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి గౌరవించాలని రాజ్యాంగంలో రాసుందా? రాత్రిపూట మందుగోళీలు ఇచ్చే వ్యక్తికి రాజ్యసభ సీటు.. మందులో సోడా పోసేవారికి మంత్రి పదవి ఇవ్వాలని రాసుందా? జీ హుజూర్ అని సలాం కొట్టే వ్యక్తికి హోం మంత్రి పదవి ఇవ్వాలని రాసుందా? అని నిప్పులు చెరిగారు. ప్రజాధనం దుర్వినియోగం చేయాలని రాజ్యాంగంలో రాసుందా? అని సంజయ్ ప్రశ్నించారు. మొత్తానికి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారమే రేపుతున్నాయి. మరిదీనికి కౌంటర్‌గా టీఆర్ ఎస్ నేతలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.